పవన్ కళ్యాణ్ అనే నేను.. బాహుబలి ఇంటర్వెల్ సీన్ రిపీట్.. ఆ సౌండ్‌‌కు జగన్‌కు వణుకు : కిరాక్ ఆర్పీ మాస్ కామెంట్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమి తరపున శాసనసభాపక్షనేతగా చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబును కూటమి తరపున సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా .. ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా అతిరథ మహారథులు తరలిరానున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.

మరోవైపు.. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగమవుతారా .. ? లేదా ..? అనే సస్పెన్స్ నెలకొంది. జనసేన పార్టీ తరపున గెలిచిన 21 మందిలో కొందరికి కేబినెట్ పదవులు కోరడంతో సరిపెట్టి.. తాను పార్టీ సారథ్య బాధ్యతలకే పరిమితమవుతారా అన్నది తెలియాల్సి ఉంది.

Jabardasth Kiraak RP says that if Pawan Kalyan take oath as Dy CM the Baahubali scene will be repeated

కానీ జాతీయ మీడియా, సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కానున్నారని కథనాలు వస్తున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిమిత్తం పవన్ ఢిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా జాతీయ వార్తా సంస్థ ఇండియా టుడే ప్రతినిధి పవన్‌తో మాట్లాడారు.

ప్రభుత్వంలో ఏదైనా కీలక పదవిని చేపట్టనున్నారా అని విలేకరి అడగ్గా .. పవన్ సమాధానాలు అస్పష్టంగా వినిపించాయి. కానీ సదరు ప్రతినిధి మాత్రం పవన్ ఏపీ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సదరు ఛానెల్‌లో సైతం స్క్రోలింగ్‌లో వేశారు. పవన్ ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారన్నది ఆ వార్త సారాంశం.

Jabardasth Kiraak RP says that if Pawan Kalyan take oath as Dy CM the Baahubali scene will be repeated

అయితే.. పవన్ కోరడమే ఆలస్యం ఉపముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు కట్టబెట్టకుండా ఉండరు. ఆయనతో పాటు కొందరు జనసేన ఎమ్మెల్యేలకు కూడా కీలక పదవులు దక్కుతాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. దీంతో బుధవారం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు తెగ పోస్టులు పెడుతున్నారు.

ఇక జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ మరో అడుగు ముందుకేసి పవన్ ప్రమాణ స్వీకారం జరిగితే ఎలా ఉంటుందో తనదైన మాటల్లో చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. రేపు ''పవన్ కళ్యాణ్ అనే నేను '' అన్న బయటికొస్తే బాహుబలిలో ప్రభాస్ ప్రమాణ స్వీకారం చేసే స్థాయిలో వేదిక దద్ధరిల్లుతుందని జోస్యం చెప్పాడు. ఒక అరగంట పాటు ఆ సౌండ్‌కే జగన్మోహన్ రెడ్డికి వణుకుపుడుతుందని ఆర్పీ వ్యాఖ్యానించారు. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర మొదలవుతుందని.. జగన్‌కు వేసిన అతిపెద్ద శిక్ష పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడమేనని కిరాక్ ఆర్పీ అన్నాడు.

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి పార్ట్ - 2లో భల్లాలదేవుడు, అమరేంద్ర బాహుబలి ప్రమాణ స్వీకారం చేసే సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. తొలుత చక్రవర్తిగా భల్లాలదేవుడు ప్రమాణం చేసిన తర్వాత.. మహిష్మతికి సర్వసైన్యాధ్యక్షుడిగా అమరేంద్ర బాహుబలి ప్రమాణం చేస్తాడు.

ప్రభాస్ వచ్చి.. '' అమరేంద్ర బాహుబలి అనే నేను '' అనగానే సభలో ఉన్న జనం, సైనికులు, ఇతర ప్రముఖులు బాహుబలి జయహో అంటూ నినాదాలు చేస్తారు. ఈ సీన్ మూవీకే హైలెట్‌గా నిలిచింది. రేపు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఇంతకు మించి స్పందన వస్తుందంటున్నారు కిరాక్ ఆర్పీ. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X