పవన్ 6 కోట్ల విరాళం.. 3 వేల కోట్లు దోచుకొన్నావు.. రోజాకు ఇచ్చిపడేసిన కిరాక్ ఆర్పీ
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పోటెత్తి వరదలొచ్చాయి. ముఖ్యంగా విజయవాడ నగరం పరిస్ధితి దారుణంగా తయారైంది. ఏకధాటిగా కురిసిన వర్షానికి కృష్ణానది, బుడమేరు వాగు పొంగి వరద నీరు కాలనీల్లోకి చొచ్చుకొచ్చింది. ఇప్పటికీ నగరంలోని కీలక ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి.
అయితే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదంటూ వైసీపీ నేత రోజా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీనికి పవన్ అదే స్థాయిలో కౌంటరిచ్చారు, తాజాగా ఈ ఇష్యూపై జబర్దస్త్ కిరాక్ ఆర్పీ స్పందించారు. అదేంటో ఒకసారి పరిశీలిస్తే.
విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం 24 గంటలూ శ్రమిస్తోంది. అయితే చాలా ఏరియాల్లో పిల్లలను తీసుకుని కట్టుబట్టలతో భవనాలపైకెక్కి సాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు జనం.
ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్‌తో పాటు వాయుసేన ప్రత్యేక హెలికాఫ్టర్లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అయితే అధికారులు ఇంతగా శ్రమిస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా ఆరోపణలు చేశారు. ఆయన ఐదురోజులుగా విజయవాడకే రాలేదని పవన్ కళ్యాణ్‌కు ప్రజలను కాపాడాలనే చిత్తశుద్ధి లేదంటూ దుయ్యబట్టారు.

దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా కౌంటరిచ్చారు. తన వల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదనే దూరంగా ఉన్నట్లు పవన్ చెప్పారు. తాను బోటు వేసుకుని ఆ ప్రాంతాలకు వెళితే జనం ఒక్కసారిగా మీద పడిపోతారని, అది మరిన్ని సమస్యలకు దారి తీస్తుందని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు.
తనపై విపక్షాలు నిందలు వేయాలని తప్పించి, మరొకటి కాదని రోజాకు పవన్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే ఏపీ , తెలంగాణ సీఎంల సహాయనిధికి చెరో కోటి చొప్పున రూ.2 కోట్లు విరాళం ప్రకటించిన జనసేనాని.. బుధవారం రాష్ట్రంలోని 400 పంచాయతీలకు లక్ష చొప్పున రూ.4 కోట్లు మొత్తంగా రూ.6 కోట్లను విరాళంగా ప్రకటించారు.
పవన్ కళ్యాణ్‌పై రోజా వ్యాఖ్యల నేపథ్యంలో జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పీ మీడియా ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వరదలు, సహాయక చర్యలపై ఓ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆర్పీ పాల్గొన్నారు. రెండు మూడు గంటల ముందు జనాన్ని అప్రమత్తం చేస్తే వెళ్లిపోవడానికి విజయవాడ చిన్న నగరం కాదని.. రోజా మాదిరిగా రూ.3 వేల కోట్లు దోచుకుని ఉంటే ఇంటికొక హెలికాఫ్టర్ పెట్టుకునే వారని ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్ములో కనీసం పది పైసలైనా వరద బాధితులకు ఖర్చు చేశావాపై రోజాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ వరద బాధితులకు రెండు కోట్లు.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా 400 పంచాయతీలకు లక్ష చొప్పున రూ.4 కోట్లు, మొత్తం 6 కోట్లను విరాళంగా ఇచ్చారని ఆర్పీ చెప్పారు. ఇప్పటికే ఉన్నదంతా ప్రజలకు ఇచ్చేసిన పవన్ .. ఇప్పుడు తాజాగా ప్రకటించిన విరాళం కోసం ఎక్కడో ఒక చోట అప్పు చేసే ఉంటారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కోట్లు సంపాదించిన వైసీపీ నేతల్లో ఒక్కరైనా విజయవాడ వాసులకు ఒక్క రూపాయైనా ఇచ్చారా అని ఆర్పీ ప్రశ్నించారు. రాసుకొచ్చిన స్క్రిప్ట్‌తో రోజా ఏదేదో మాట్లాడుతోందని ఆయన దుయ్యబట్టారు. ప్రస్తుతం కిరాక్ ఆర్పీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











