ఇండస్ట్రీలో అనసూయకు అలాంటి పరిస్థితి ఎదురైతే? రంగమ్మత్త ఎలా మేనేజ్ చేస్తుందో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ తో పాటు పలు ఇబ్బందికర పరిస్థితులు తరచుగా ఎదురవుతూ ఉంటాయని, వాటికి మనం ఎలా రియాక్ట్ అవుతాము అన్న విషయం పైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఎంతోమంది తారలు చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇలాంటి పరిస్థితులను టాప్ యాంకర్, నటి అనసూయ ఎలా ఎదుర్కొంటుంది? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై మనమూ ఓ లుక్కేద్దాం పదండి.

జబర్దస్త్ షోతో యాంకర్ గా విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది అనసూయ భరద్వాజ్. కుటుంబ సమేతంగా చూసే షోలలో చిట్టి పొట్టి బట్టలు వేసుకొని ఈమె అసభ్యకర లుక్స్ ఏంటి అనే విమర్శలు వినిపించినప్పటికీ, అప్పటిదాకా యాంకర్లు ఇలాగే ఉండాలి అనే పద్ధతిని బ్రేక్ చేసింది అనసూయ.

Jabardasth popular anchor actress anasuya bharadwaj Casting Couch comments goes viral in the tollywood

ఇక ఆ తర్వాత తనకున్న క్రేజ్ తో సినిమాల్లో అవకాశాలు పట్టేసి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. అయితే ఈ బ్యూటీ వివాదాల్లో కూడా తరచుగా ఇరుక్కుంటూ ఉంటుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో అనసూయ వివాదం అప్పుడప్పుడూ తెరపైకి వస్తూ ఉంటుంది.

ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉంటూ సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ పై ఫోకస్ చేసింది ఈ అమ్మడు. మరి యాంకర్ నుంచి స్టార్ నటిగా ఎదిగిన ఈ బ్యూటీకి ఇప్పటిదాకా ఇండస్ట్రీలో అసలు చేదు అనుభవాలే ఎదురు కాలేదా? అంటే ఎదురయ్యాయి అనే చెప్తుంది అనసూయ.

అయితే వాటికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అనేదే ముఖ్యమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ఇబ్బందికర పరిస్థితులను ఎలా మేనేజ్ చేస్తాను అనే ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టింది.

సినిమాల విషయంలో ఎవరినైనా మీట్ అయినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి అనే విషయం మొదటి మూడు నిమిషాల్లోనే తెలిసిపోతుందని క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే ఆ టైంలో తనకు ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే మాట మార్చేసి తన హస్బెండ్, పిల్లల ప్రస్తావన తీసుకొచ్చి కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటుందట అనసూయ.

Jabardasth popular anchor actress anasuya bharadwaj Casting Couch comments goes viral in the tollywood

ఇంకేముంది అవతలి వాళ్ళు నోరు మూయక తప్పదు. అయితే ఇండస్ట్రీలో తరచుగా ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయని, అలాగని వాళ్లతో జర్నీ అక్కడితో ఆగదు కాబట్టి స్పాంటేనియస్ గా వ్యవహరించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా అనసూయ వెల్లడించింది.

పరిస్థితి ఏదైనా ఇద్దరి మధ్య ఆహ్లాదకర వాతావరణం కంటిన్యూ అయ్యేలా చూసుకోవాలని, అప్పుడే ముందు ముందు వాళ్ళని చూసి ఇబ్బంది పడే అవసరం రాదని వివరించింది ఈ హాట్ యాంకర్.
వాళ్లు కూడా మనల్ని చూసినప్పుడల్లా అరే ఇలా జరిగిందే అనే పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలంటే కొట్టినట్టుగా కాకుండా కర్రా విరగదు పాము చావదు అన్న చందాన? వ్యవహరించాలని చెప్పుకొచ్చింది అనసూయ.

ఇంకేముంది ఈ యంగ్ బ్యూటీ ఇబ్బందికర పరిస్థితులను ఎలా మేనేజ్ చేస్తుందో తెలుసుకున్న ఆమె అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ యాంకర్ ని చూసి నేర్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో మోసపోయే అవకాశం తక్కువగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అనసూయ పుష్ప 2 మూవీలో కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Read more about: anasuya bharadwaj jabardasth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X