JACK Trailer Review: మగ XX కొడుకులతో తిరిగి సంక నాకింది.. నన్నెందుకు ఎక్కడం? జాక్ ట్రైలర్ రివ్యూ
టాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన చిత్రం జాక్. స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ, బేబీ ఫేమ్ వైష్ణవీ చైతన్య జంటగా నటించిన ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, రవి ప్రకాశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఎలా ఉందంటే?
దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో టెర్రరిస్టు కార్యకలాపాలను కట్టడి చేసే అధికారిగా ప్రకాశ్ రాజ్ బ్రీఫింగ్ ఇస్తుండటం ద్వారా ట్రైలర్ మొదలవుతుంది. ఇంటెలిజెన్స్ అధికారిగా ప్రకాశ్ రాజ్ నేరస్థులను విచారిస్తూ.. టెర్రిరిస్టు కార్యకలాపాలను పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని దర్శకుడు భాస్కర్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఓ నేరస్థుడిని విచారిస్తుండగా.. చాలా విషయాలను జాక్‌కు చెప్పాను అనగానే.. ప్రకాశ్ రాజ్ ఆశ్చర్యంగా జాక్ అంటూ సందేహాన్ని వ్యక్తం చేస్తాడు.

అలా జాక్‌గా జోన్నలగడ్డ సిద్దూ కాలేజీలో ఎంట్రీ ఇస్తూ కనిపిస్తాడు. ఉద్యోగానికి షార్ట్, టీషర్ట్‌తో ఇంటర్వ్యూకు వెళ్తే.. బ్లేజర్ ఏది అని అధికారులు అడుగుతారు. దాంతో ఇంటర్వ్యూ నాకు కాదా? నా బ్లేజర్‌కా? అంటూ సెటైర్ వేస్తాడు. ఇక సిద్దూ తండ్రిగా నరేష్.. తన కొడుకు భవిష్యత్ గురించి ఆందోళన చెందుతుంటే.. కొడుకు మాత్రం ఆయనపై సెటైర్లు వేస్తుంటాడు. మగాడిగా నీకు కొన్ని రిక్వైర్‌మెంట్స్ ఉంటాయి. కానీ పని మనిషిని గోకుతావా? అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తాడు. తండ్రి కొడుకుల మధ్య కెమిస్ట్రీని తెలియజేసింది.
ట్రైలర్‌లో వైష్ణవీ చైతన్య, సిద్దూ మధ్య రొమాంటిక్ ట్రాక్ బాగానే ఉంటుందనే విషయాన్ని ట్రైలర్‌లో చూపించారు. వైష్ణవీ, సిద్దూ రొమాన్ప్ చేసుకొంటుంటే.. దాని ముఖం పచ్చడి చేస్తాడేమో అంటూ పక్కన ఉన్న స్నేహితుడు కామెంట్ చేస్తాడు. అంధేరి రాత్ మే.. జియా తేరే గోధ్ మే అంటూ సిద్దూ రొమాంటిక్‌గా సిగ్నల్ ఇస్తే.. వైష్ణవి ఓ లిప్ కిస్ ఇచ్చి పారిపోతుంది. ఇక మరో సీన్‌లో హాస్పిటల్‌లో లేడీ డాక్టర్ వద్ద.. వైష్ణవీని చూపిస్తూ.. నడుము విరిగింది అంటే.. డాక్టర్ సిగ్గుపడిపోతుంది. దాంతో మీరు అంత సిగ్గుపడకండి. యాక్సిడెంట్ మాత్రమే అయింది అని సిద్దూ సర్ది చెబుతాడు.
మరో సీన్‌లో వైష్ణవీ, సిద్దూ కిస్ సీన్ ఓపెన్ చేస్తే.. ఆ కిస్ ఏదో పెట్టి కమిట్ అయిపోదాం అంటుంటే.. ఆమె పారిపోతుంది. మాకు కూడా రొమాన్స్ చేయాలని ఉంటుంది. మా ఆటో మీటర్ డౌన్ అయింది. మాకు కూడా ఆషికీ లాడాయించాలని ఉంటుందని అంటుంటే అంతలోనే రవి ప్రకాశ్ వచ్చి.. సార్ రమ్మంటున్నారు అంటాడు. ఈ మగ ముండా కొడుకులతో తిరిగి తిరిగి..నా జీవితం సంక నాకిపోయింది. మీ సార్‌కి పెళ్లి కాలేదా? జాక్ అడిగితే.. అయింది అంటాడు. దాంతో భార్యతో రొమాన్స్ చేసుకోమని.. నన్ను ఎందుకు ఎక్కుతాడు అని జాక్ అనడం చూస్తే.. సినిమాలో మంచి హ్యుమర్ ఉంటుందని సిగ్నల్ దర్శకుడు భాస్కర్ ఇచ్చాడనిపిస్తుంది.
టెర్రిరిస్టులను, డ్రగ్స్ పట్టుకోవడానికి ప్రకాశ్ రాజ్, జాక్ ఇద్దరు వారి ఆపరేషన్లలో ఇన్వాల్ అవుతాడు. మీరు ఎందుకు లేట్ వచ్చారని జాక్ అడిగితే.. నీకు ఎలాంటి పర్మిషన్స్ అక్కర్లేదు. మాకు పీఎం, ఇతర అధికారుల అనుమతి కావాల్సి ఉంటుంది అంటాడు. అయితే నాది ఆపరేషన్ బటర్ ఫ్లే అని జాక్ అంటే.. నాది ఆపరేషన్ రెడ్ థండర్ అని ప్రకాశ్ రాజ్ సమాధానం ఇస్తాడు. దాంతో థండర్ ఎక్కడైనా రెడ్‌గా ఉంటుందా? అని మరోసారి జాక్ సెటైర్ వేస్తాడు.
జాక్ ట్రైలర్ చూస్తే.. టెర్రిరిస్ట్, డ్రగ్స్ బ్యాక్ డ్రాప్‌తో యాక్షన్, రొమాంటిక్ మూవీగా రూపొందిందని స్పష్టమైంది. యూత్‌ను టార్గెట్ చేస్తూ రొమాంటిక్ సీన్లు, డైలాగ్స్ పుష్కలంగా ఉంటాయనే విషయాన్ని ట్రైలర్‌లో వెల్లడించారు. ప్రకాశ్ రాజ్-సిద్దూ, వైష్ణవీ చైతన్య - సిద్దూ మధ్య ఎపిసోడ్స్ బాగున్నాయనే ఫీలింగ్ ట్రైలర్ కల్పించింది.


Click it and Unblock the Notifications











