twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాహో : జాకీ ష్రాఫ్ లుక్ స్టైలిష్‌గా... పాత్ర క్రూరంగా!

    |

    ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహో' చిత్రంలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కీలకమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో ఆయన పాత్ర పేరు రాయ్. సినిమా ప్రమోషన్లో భాగంగా ముఖ్యమైన పాత్రలను పరిచయం చేస్తూ వారి ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్న చిత్ర బృందం తాజాగా రాయ్ లుక్ వదిలారు.

    ఎస్ అని చెప్పు లేదా చావు... అతడు నీకు ఎక్కువ అవకాశం ఇవ్వడు అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో జాకీ ష్రాఫ్ లుక్ స్టైలిష్‌గా, విభిన్నంగా ఉంది. ఈ మూవీలో హైలెట్ అయ్యే పాత్రల్లో రాయ్ పాత్ర ఒకటని, కథలో అతడి రోల్ ప్రధానంగా ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది.

    Jackie Shroff look from Saaho released

    ఈ చిత్రంలో ప్ర‌భాస్ సరసన బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. యువీ క్రియేష‌న్స్ బేనర్లో వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్‌ రూ. 300 కోట్ల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. అగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‍‌గా ఈ మూవీ విడుద‌ల కాబోతోంది.

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి బాహుబలి త‌రువాత వ‌స్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగిన విధంగానే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీకి ప్రధాన్యత ఇస్తూ దీన్ని తెరకెక్కించారు. టెక్నికల్ వ్యాల్యూస్ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయి.

    తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఇంకా జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

    English summary
    The Bollywood senior Jackie Shroff is playing a character named Roy in Saaho. The movie team released Roy look today. Saaho releasing worldwide on 30th August.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X