RC15: చరణ్ సినిమాలో శ్రీలంక బ్యూటీ.. ఆ రాజకీయ నాయకులే టార్గెట్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న బడా హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. పేరుకు మెగాస్టార్ చిరంజీవి కుమారుడే అయినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుతూ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న అతడు.. ఆ తర్వాత కూడా చాలా విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి అస్సలు వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఫలితంగా తన క్రేజ్‌తో పాటు మార్కెట్‌ను భారీగా పెంచుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.

కొద్ది రోజుల క్రితమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR (రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ మూవీతో సంచలన విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, ఈ మూవీతో అతడి రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. అయితే, ఆ తర్వాత వచ్చిన 'ఆచార్య' మాత్రం భారీ డిజాస్టర్‌ అయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్‌తో చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఏమాత్రం తగ్గకుండా షూటింగ్ చేస్తున్నారు.

Jacqueline Fernandez Special Song in Ram Charan Movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఎస్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన 60 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా పూర్తైంది. ఇక, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ పార్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా షూట్ చేయబోతున్నారు. దీనికోసమే ఏకంగా రూ. 20 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించారని అంటున్నారు. దీనితోపాటే ఓ స్పెషల్ సాంగ్‌ను కూడా షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పాట గురించి అదిరిపోయే అప్‌డేట్ ఒకటి ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

క్రేజీ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతున్నట్లు ముందే చెప్పుకున్నాం. దీన్ని శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చేయబోతుందని తెలిసింది. అయితే, ఈ పాట మాత్రం ప్రస్తుత పొలిటికల్ సిస్టమ్‌పై సెటైరికల్‌గా ఉండబోతుందని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇప్పుడున్న అవినీతి రాజకీయ నాయకులను విమర్శిస్తూ ఈ సాంగ్‌ను కంపోజ్ చేశారని తెలుస్తోంది. ఇందులో జాక్వెలిన్ స్టెప్పుల కంటే ఆలోచింపజేసే లిరిక్స్ హైలైట్ కాబోతున్నాయట. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ పాటను రికార్డ్ కూడా చేసేశాడనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ స్పెషల్ సాంగ్‌పై అంచనాలు నెలకొన్నాయి.

పాన్ ఇండియా రేంజ్‌లో రాబోయే ఈ సినిమాలో రామ్ చరణ్ డుయల్ రోల్ చేస్తున్నాడని కూడా తెలుస్తోంది. ఇక, ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు 'సిటిజన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X