కోట్ల ఆస్తి , తిరుగులేని స్టార్ డమ్..రోడ్డునపడ్డ టాలీవుడ్ హీరో ..వీడియో వైరల్
వెండితెర వేల్పులుగా ప్రజల గుండెల్లో నీరాజనాలు అందుకుంటున్నా.. వందల కోట్ల ఆస్తులు ఉన్నా.. కొందరు సినీతారలు నిరాడంబరంగా ఉండేందుకే ఇష్టపడతారు. పబ్లిక్‌కు, మీడియాకు దూరంగా ప్రశాంత వాతావరణం గడపాలని చూస్తారు. అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా ఎలా ఉండగలుగుతున్నారని చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. డబ్బు, దర్పం, హోదా చూపించే కొందరు స్టార్స్‌కి ఇలాంటి వారు ఆదర్శంగా నిలుస్తారు.
డబ్బుకు లోకం దాసోహం అన్న సంగతి తెలిసిందే. ఎంతటి వాడైనా సరే డబ్బు లేకుంటే జీరో . డబ్బు ఉన్నప్పుడు చుట్టూ చేరి భజన చేసే జనాలు.. మన దగ్గర రూపాయి లేనప్పుడు క్షణం కూడా మన పక్కన నిలబడరు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరికీ ఇది అనుభవమే. తెలుగులో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు తన జీవితంలో ఇలాంటి పరిస్ధితిని ఎదుర్కొన్నారు.

జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ బడా నిర్మాత, దర్శకుడు. జగపతి ఆర్ట్స్ బ్యానర్‌పై అలనాటి అగ్రనటులతో సినిమాలు తీశారు. బలమైన సినీ నేపథ్యం ఉండటంతో జగపతి బాబు ఇండస్ట్రీలోకి చాలా ఈజీగా ప్రవేశించారు. కానీ నటుడిగా నిలదొక్కుకోవడానికి ఆయన ఎంతో కష్టపడటమే కాదు శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఫేవరెట్ హీరోగా నిలిచారు. 90వ దశకంలో తన హవా చూపించిన జగపతి బాబు.. తర్వాత కొత్త హీరోల ఎంట్రీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు.
మధ్యలో అవకాశాలు రాకపోవడం, వందల కోట్ల ఆస్తి కరిగిపోవడంతో ఆర్ధికంగానూ ఎంతో ఇబ్బందిపడ్డారు . ఇలాంటి దశలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లెజెండ్‌లో విలన్‌గా అవతారమెత్తి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఆయన వేసిన బాటలో పలువురు సీనియర్ హీరోలు కూడా ప్రతినాయక పాత్రలు వేస్తున్నారు. 60 ప్లస్‌లోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో కుర్రాళ్లకి పోటీ ఇస్తున్నారు జగపతి బాబు.
Bhimavaram food festival continuity ki ee manishi road na paddadu… Bandi food Bandi foodey… pic.twitter.com/h2KkK09Y0Z
— Jaggu Bhai (@IamJagguBhai) December 25, 2024
అభ్యుదయ భావాలున్న జగపతి బాబు సింపుల్‌గా ఉండటానికే ప్రాధాన్యతను ఇస్తారు. మీడియాకు, పబ్లిక్‌కు దూరంగా ఉండే ఆయన మైక్ అందుకున్నారంటే ఎవరినైనా , ఏ విషయంపై అయినా చెడుగుడు ఆడుకుంటారు. ఎవరు ఏమనుకున్నా సరే తను చెప్పాల్సింది సూటిగా, సుత్తి లేకుండా చెప్పేస్తారు జగపతి బాబు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే జగపతి బాబు ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భీమవరం ఫుడ్ ఫెస్టివల్‌లో భాగంగా రోడ్డుపై ఉన్న వెరైటీలను జగపతి టేస్ట్ చేశారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆయన దానికి భీమవరం ఫుడ్ ఫెస్టివల్ కంటిన్యూటికీ ఈ మనిషి రోడ్డున పడ్డాడు అనే క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తుండగా టాప్ ట్రెండింగ్‌లో ఉంది.


Click it and Unblock the Notifications











