జగపతి బాబు షాకింగ్ కామెంట్స్: సలార్ స్టోరీ చెప్పలేదు.. ఒక్క సీన్‌కే అన్ని రోజులంటూ!
కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు హ్యాండ్సమ్ అండ్ టాల్ హీరో ప్రభాస్. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. 'బాహుబలి' మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ బడా హీరో.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రభాస్.. తన మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను కూడా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో పెంచుకుంటూ ముందుకెళ్తోన్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చాలా చిత్రాలు చేస్తోన్నాడు. అందులో ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా వస్తోన్న 'సలార్' ఒకటి. 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ చిత్ర షూటింగ్.. కొన్ని బ్రేకుల నడుమ సజావుగానే సాగుతోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన 60 శాతానికి పైగానే షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే మిగిలిన భాగాన్ని కూడా కంప్లీట్ చేసేలా ప్లాన్స్ చేసుకుంటోన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై జగపతి బాబు మాట్లాడారు.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'సలార్' మూవీలో జగపతి బాబు విలన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన 'రామబాణం' మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఇందులో ప్రభాస్ మూవీలో తన పాత్ర గురించి మాట్లాడారు. 'సలార్‌లో నటిస్తున్నాను. నిజం చెప్పాలంటే ఇందులో నా పాత్ర గురించి నాకే క్లారిటీ లేదు. నేను ఐదు రోజులు షూట్ మాత్రమే చేశాను. ఇందులో ఒకే ఒక్క సీన్ మాత్రమే చిత్రీకరించారు. ప్రశాంత్ నీల్ అసాధారణమైన టాలెంట్ ఉన్న డైరెక్టర్. అందుకే సలార్ స్టోరీ గురించి అడగలేదు' అని చెప్పుకొచ్చారు.

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సలార్' మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో విలన్‌లుగా నటిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











