Pushpa 3: పుష్ప 3పై క్రేజీ అప్‌డేట్.. క్యారెక్టర్‌పై జగపతి బాబు హింట్

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు చిత్రాలు కలిపి దాదాపు 2200 కోట్లకు పైగా వసూళ్లతో పాటు అల్లు అర్జున్‌ని పాన్ ఇండియా హీరోగా మార్చింది. ఇప్పటికీ పుష్ప మేనియా అలాగే కొనసాగుతోంది. పుష్ప పాటలు, డైలాగులు మారుమోగుతూనే ఉన్నాయి. ఇంతటి హిట్ ఫ్రాంచైజీకి మూడో భాగం ఉంటుందా? లేదా? అంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. తాజాగా పుష్ప 3పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగపతి బాబు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
రోడ్డుపై కారు వదిలేసి పరిగెత్తిన సుమ కనకాల.. స్టార్ యాంకర్‌కు చేదు అనుభవం..
రోడ్డుపై కారు వదిలేసి పరిగెత్తిన సుమ కనకాల.. స్టార్ యాంకర్‌కు చేదు అనుభవం..

పుష్ప 3ని ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి అన్న దానిపై సుకుమార్ ఎప్పుడో హింట్ ఇచ్చేశారు. అలాగే దీనికి పుష్ప ది ర్యాంపేజ్ పేరుతో టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే అల్లు అర్జున్ ఇప్పుడున్న బిజీలో పుష్ప 3 ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా అన్న క్లారిటీ లేదు, కొందరైతే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సాధ్యం కాదని కూడా తేల్చేశారు. కానీ పుష్ప 3 కోసం మైత్రీ మూవీ మేకర్స్ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఆఫీస్ తెరిచి అక్కడ స్క్రిప్ట్ వర్క్, స్టోరీ డిస్కషన్స్ నడిపిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం గాసిప్స్ వైరల్ అయ్యాయి.

Jagapathi Babu Drops Major Hint on Pushpa 3 Sparks Excitement Among Allu Arjun Fans

షెకావత్ సార్ బతికే ఉన్నాడా? తన వాళ్లందరినీ చంపిన పుష్పరాజ్‌పై కేంద్రమంత్రి ప్రతాప్ రెడ్డి ఎలా పగ సాధించాడు? తన కుటుంబాన్ని, ఎర్రచందనం సామ్రాజ్యాన్ని పుష్పరాజ్ ఎలా దక్కించుకున్నాడు? అనే అంశాల చుట్టూ పుష్ప ది ర్యాంపేజ్ ఉంటుందని చిత్ర పరిశ్రమలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో రాకా చేస్తున్నాడు. ఇది ముగిసిన వెంటనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ డైరెక్ట్ చేస్తున్న మూవీలో నటించనున్నాడు. ఆ తర్వాత మరికొందరు స్టార్ డైరెక్టర్లు.. బన్నీతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అటు సుకుమార్ కూడా రామ్ చరణ్ సహా మరికొందరు స్టార్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేసేందుకు కథలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో పుష్ప ది ర్యాంపేజ్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అసలు పట్టాలెక్కుతుందా? లేదా అన్నది అనుమానంగా మారింది. అయితే ఈ అనుమానాలు పటాపంచలు చేశారు సీనియర్ నటుడు జగపతి బాబు.

Recommended For You
నెల అంతా ఒకటే చీర కట్టుకుంటావా.. ట్రోలింగ్‌పై నటి ప్రగతి స్ట్రాంగ్ రియాక్షన్
నెల అంతా ఒకటే చీర కట్టుకుంటావా.. ట్రోలింగ్‌పై నటి ప్రగతి స్ట్రాంగ్ రియాక్షన్

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది సినిమాలు జూన్ 4వ తేదీన వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుసపెట్టి ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. దీనిలో భాగంగా జగపతిబాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సుకుమార్ క్యారెక్టర్లను చక్కగా ప్రజెంట్ చేస్తారు కానీ ఆయనకు స్టోరీ చెప్పడం రాదని మీరే అన్నారు.. మరి ఆయన శిష్యుడు స్టోరీ కరెక్ట్‌గా చెప్పారా? అని యాంకర్ అడగ్గా.. సుకుమార్ నేరేషన్ డిఫరెంట్. కానీ రెండు మూడు లైన్లకే కథ అర్ధమైపోతుంది. కథ చెప్పాల్సిన అవసరం లేదు. మంచి క్యారెక్టర్ ఇస్తాడని డౌట్ లేకుండా చెబుతా.. పుష్ప 2 పాపం తన తప్పేం కాదు, కానీ క్యారెక్టర్ తగ్గింది. సినిమా నిడివి పెరగడం వల్ల అలా జరిగి ఉండొచ్చు... థర్డ్ పార్ట్‌కి పుష్ అవ్వడం వల్ల అయ్యిందని జగపతిబాబు అన్నారు.

You May Also Like
దీపిక రంగరాజు ముందే ప్లేట్ విసిరికొట్టి.. యాంకర్ శ్రీముఖి అసహనం
దీపిక రంగరాజు ముందే ప్లేట్ విసిరికొట్టి.. యాంకర్ శ్రీముఖి అసహనం

కానీ తన ఉద్దేశం మాత్రం నా క్యారెక్టర్ బాగుండాలని ఉండేది. లేదంటే అలాంటి డైరెక్టర్ నాలాంటి వాడిని పెట్టుకోడు కదా? ఫేవర్ చేయడు.. ఫేవరిజం చూపించడు. ఎందుకంటే అక్కడ క్యారెక్టర్ పండాల్సిందే, వేరే ఛాయిస్ లేదు. మిస్ క్యాస్టింగ్ వల్ల ఛాలా సినిమాలు పోతాయి.. బుచ్చిబాబు కూడా స్టోరీ చెప్పలేదు. రెండు మూడు లైన్లు చెప్పాడు. అయినా స్టోరీ నాకు అవసరం లేదు. ఇలాంటి దర్శకుడు వచ్చినప్పుడు నాకు కథలు అవసరం లేదు.. డేట్స్ చెప్పండి, అవి బ్లాక్ చేస్తా అంటా. దర్శకుడిని నమ్మితే ముందుకెళ్తానని జగపతి బాబు అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుందని, జగపతిబాబు పాత్ర కూడా ఓ రేంజ్‌లో ఉండబోతోందని అర్థమవుతోంది. దీంతో బన్నీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ త్వరగా పుష్ప ది చేయాలని వారు కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: jagapathi babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X