twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జగ్గూ భాయ్‌తో తలపడనున్న యంగ్ హీరో.. షూటింగ్‌కు సిద్దమైన నాగ శౌర్య

    |

    పక్కింటి అబ్బాయి, చాక్లెట్ బాయ్ వంటి ట్యాగులకు దూరంగా కొత్తగా ప్రయత్నించేందుకు పరితపిస్తున్నాడు నాగ శౌర్య. కెరీర్ మొదట్లో లవ్ స్టోరీస్ చేస్తూ లేడీ ఫాలోయింగ్‌ను బాగానే పెంచుకున్న నాగ శౌర్య ఇటీవల మాస్ ఇమేజ్ కోసం బాగానే కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో చేసిన ప్రయత్నమే అశ్వథ్థామ. అయితే ఈ చిత్రం అనుకున్నంత ఫలితాన్ని అందించలేదు. అయినా ఏ మాత్రం వెనకడుగు వేయలేదు.

    నాగ శౌర్య ఈ మధ్యే ఓ స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్నట్టుగా, వాటికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశాడు. ఇక ఈ చిత్రం కోసం ఏకంగా పది పలకల దేహాన్ని ట్రై చేస్తున్నాడు. ఎటువంటి గ్రాఫిక్స్ వాడకూడదని సొంతంగా టెన్ ప్యాక్స్ కోసం ట్రై చేస్తుండటంలో అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి తాజాగా వచ్చింది.

    Jagapathi Babu In NS20 And Shooting Starts On 18th September

    తాజాగా నాగశౌర్య జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. షూటింగ్ దగ్గర పడుతుండటంతోనే నాగ శౌర్య జిమ్‌లో అలా కుస్తీలు పడ్డాడట. ఈ మూవీ షూటింగ్‌ను సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభించబోతోన్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా ఈ మూవీలో జగపతి బాబు ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించబోతోన్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ రెడ్డి కెమెరామెన్‌గా పని చేస్తున్నాడు. కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. జునైడ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు.

    English summary
    Jagapathi Babu In NS20 And Shooting Starts On 18th September. Naga Shaurya Latest Pic Goes Viral. Beast mode workouts IamNagashaurya Flexed biceps Uncompromising efforts for his next #NS20
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X