నీకు తిండి లేకపోతే మా ఇంటికి రా... స్టార్ హీరోకి ఫోన్ చేసి తిట్టిన ఫ్యాన్

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా స్టార్‌డమ్ అందుకున్నారు జగపతి బాబు. నట భూషణ శోభన్ బాబు తర్వాత ఆ స్థాయిలో మహిళా ప్రేక్షకుల ఆదరణను దక్కించుకున్నారు. హీరోగా తన శకం ముగిసిందని భావించిన ఆయన ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తనను తాను మార్చుకున్నారు. లెజెండ్ మూవీతో విలన్‌గా టర్న్ అయిన జగపతి బాబు.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా దక్షిణాదిలో డిమాండ్ ఉన్న నటుడిగా మారారు. అయితే ఈ మార్పు వెనుక జగపతిబాబు ఎన్నో కష్టాలు, అవమానాలు పడ్డారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

జగపతి పిక్చర్స్ అధినేత వీబీ రాజేంద్రప్రసాద్ వారసుడిగా సినీరంగంలో అడుగుపెట్టారు జగపతి బాబు. అయితే తొలినాళ్లలో ఆయన నటన, డ్యాన్స్‌పై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ వాటిని తట్టుకుని నిలబడి తన సినిమాలతోనే సమాధానం చెప్పారు. ఫ్యామిలీ, లవ్, రొమాంటిక్ మూవీలతో సత్తా చాటారు జగపతి బాబు. తర్వాత వరుస పరాజయాలు, ఆస్తులు కరిగిపోవడం వంటి పరిణామాలతో జీవితం అయిపోయిందనుకున్న స్టేజ్‌లో గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఇందుకు దోహదం చేసింది మాత్రం లెజెండ్ మూవీయే. తాజా ఇంటర్వ్యూలో తాను విలన్‌గా మారడానికి కారణమైన పరిస్ధితులను బయటపెట్టారు.

Jagapathi Babu Opens Up About Failures Alcohol Addiction and His Powerful Comeback as Villain

నాకు డబ్బులు, ఆ లెక్కలు ఏంటో తెలియదు. డబ్బులు నా కోసం, ఫ్యామిలీ కోసమే కాదు, బయటివాళ్ల కోసం కూడా సంపాదించాలి. డబ్బుకు ఇంపార్టెన్స్ ఇవ్వొద్దు.. డబ్బు జీవితానికి అవసరం కానీ, డబ్బే జీవితం కాదని గట్టిగా నమ్ముతా. టన్నులకు టన్నులు, ట్యాంకర్లకు ట్యాంకర్లు తాగేశాను.. దానిపై మోజు అయిపోయింది. సిగరెట్ ఒకటే వదల్లేకపోతున్నాను. ఈ వ్యసనం మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టలేదు. శరీరమనే బండి మనల్ని ఇంతకాలం నడిపిస్తోంది. దానికి కొంత వాల్యూ ఇవ్వాలి, ఈ బండి కూడా షెడ్డుకు వెళ్తుంది. వర్కవుట్, యోగా ఖచ్చితంగా చేయండి.. ఏదైనా లిమిట్‌లో ఉండండి అని జగపతి బాబు యువతకు పిలుపునిచ్చారు.

ఇండస్ట్రీలో మనిషికి ప్రతిరోజూ ఒకలా ఉండదు. నెంబర్‌వన్ అనే పోజిషన్ శాశ్వతం కాదు.. అది ప్రతి శుక్రవారం మారుతూనే ఉంటుంది. లైఫ్ లాంగ్ ఎవరూ నెంబర్‌వన్‌గా ఉండలేరు. నెంబర్ వన్ అనేది ఒక్కటే ఉంటుంది.. కాబట్టి కొత్తవారు వస్తూనే ఉంటారు. అందుకే నేను ఏ ట్యాగ్ వేయించుకోలేదు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు.. నేను నటుడిని మాత్రమే. నేను హీరోని అని ఇంట్లో కూర్చొని నేను హీరోనని ఫీల్ అవుతూ ఉంటా, జనం ఫీల్ అవ్వరు. నన్నెవరూ యాక్సెప్ట్ చేయడం లేదని మందు మొదలెడతాం.. అది 10 పెగ్గులు అవుతుంది, తాగితే డిప్రెషన్‌లోకి వెళ్తాం. ఇదంతా దేనికి ట్యాగ్ తీసి చెత్తబుట్టలో పడేయండి. నేను హెయిర్ మెయింటైన్ చేయను, ఏ షాంపూ దొరికితే అది వాడతా.. ఏది లేకపోతే సబ్బు వాడతా. అది రావాలి కాబట్టి నాకు వచ్చింది.. నా ఫేస్‌కి కానీ, నా హెయిర్‌కి కానీ ఏం వాడను, బేసిగ్గా నేను బద్ధకస్తుడినని జగపతి బాబు తెలిపారు.

ఆరు అని ఒక సినిమా చేశా.. రూపాయి లేనప్పుడు కేవలం డబ్బులు కోసం చేశా. అది నీచమైన సినిమా అని నాకు తెలుసు.. అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది, ఒక్క షో కూడా రిలీజ్ కాదని ఎక్స్‌పెక్ట్ చేశా. అయితే నాకు కాకినాడలో డై హార్డ్ ఫ్యాన్ ఒకడున్నాడు. వాడు సినిమా చూసి.. నాకు ఫోన్ చేశాడు. ఏంట్రా.. ఇవాళ ఆరా, రేపు ఏడా, రేపు ఐదా .. నీకు తిండి లేకపోతే మా ఇంటికి రా భోజనం పెడతా. అంతేకానీ ఎదవ సినిమాలు తీయమాకు అని చెప్పాడని జగపతి బాబు గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Read more about: jagapathi babu tollywood news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X