మరో మల్టీస్టారర్ కథలో జగ్గూ భాయ్ పవర్ఫుల్ రోల్

జగపతిబాబు ఎలాంటి పాత్రలు చేసినా ఈ మధ్య కాలంలో ఒక స్పెషల్ క్రేజ్ ఏర్పడుతోంది. ఎప్పుడైతే బోయపాటి ఆయనను విలన్ గా చూపించారో అప్పటి నుంచి వెండితెరపై పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు. అగ్ర దర్శకుల సినిమాల్లో కూడా ఆయన పాత్రలు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. ఒకప్పుడు హీరోగా సంపాదించిన దానికంటే ఇప్పుడే స్పెషల్ పాత్రల్లో భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

ఇక ఆయన చేతిలో ఇప్పుడు మంచి సినిమాలే ఉన్నాయి. అందులో ఒక మినీ మల్టీస్టారర్ కూడా ఉంది. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహా సముద్రంలో శర్వానంద్, సిద్దార్థ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో జగపతిబాబు పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగా పలువురు బాలీవుడ్ స్టార్స్ ని అనుకున్నప్పటికి దర్శకుడు మళ్ళీ జగపతిబాబునే సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Jagapathi babu powerful role on mahasamudram movie

ఇక మహాసముద్రం సినిమా విషయానికి వస్తే దర్శకుడు అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 హిట్టయినప్పటి నుంచి ఆ కథను చాలా మంది హీరోలకు చెప్పాడు కానీ వర్కౌట్ కాలేదు. అక్కినేని మెగా అల్లు కాంపౌండ్స్ వరకు వెళ్లిన ఆ కథను అందరు హీరోలు పొగిడారు గాని మల్టీస్టారర్ లో హెచ్చుతగ్గుల దగ్గర బయపడినట్లు టాక్ వచ్చింది. ఇక ఫైనల్ గా కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ సిద్దార్థ్ నటించడానికి ఒప్పుకున్నాడు. ఇక శర్వానంద్ పాత్ర కూడా ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X