దారుణమైన రూమ్స్‌లో హీరోయిన్లు... అన్నీ భరిస్తూనే షూటింగ్‌కి.. జగపతిబాబు
తెలుగు చిత్ర పరిశ్రమలోని విలక్షణ నటుల్లో జగపతి బాబు కూడా ఒకరు. శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ హీరోగా అంతటి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పీక్స్ చూసిన ఆయన.. ఆ తర్వాత అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డారు. మళ్లీ బంతిలా బౌన్స్ బ్యాక్ అయి దక్షిణాదిలోనే బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నిలిచారు. నటనే కాదు.. ఆయన వ్యక్తిత్వం కూడా విలక్షణమైనదే. మంచితనం, మొండితనం మిక్స్ అయిన పర్సనాలిటీ జగపతి బాబుది. మనసులో ఏమున్నాసరే కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం ఆయన స్టైల్. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటారు. సమాజాన్ని, మనుషుల్ని బాగా స్టడీ చేసిన జగపతిబాబు.. మైక్ అందుకున్నారంటే చాలు వణికిస్తారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
జగపతి బాబు, లయ జంటగా నటించిన చిత్రం వదలా. హృతిక శ్రీనివాస్, అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, జెన్నీ, రీను, కశ్యప్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కిశోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఆకెళ్ల వీ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పనిచేశారు. కార్తీక్ బీ కొడకండ్ల సంగీత దర్శకత్వం వహించారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వదలా మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగపతి బాబు మాట్లాడారు.

వదలా సినిమా ఇంత బాగా రావడానికి రీజన్.. ఛోటా కే నాయుడు. ఈయనే సినిమాకు హీరో. ఆయన చేసిన హార్ట్ వర్క్ ఎంతో గొప్పది. చిన్న ఇబ్బంది అయి నేను ఛోటాని రిక్వెస్ట్ చేశా ఈ సినిమాని. దాంతో రెండో మాట లేకుండా మనం చేసేస్తున్నాం అని చెప్పాడు. మీ బడ్జెడ్ ఎంతైనా నేనే చేస్తానని ముందుకొచ్చాడు.. తన ఎనర్జీ అందరికీ పంచాడు. ఇన్నిరోజులు షూటింగ్‌ని ఎంజాయ్ చేస్తూ చేశామంటే దానికి కారణం ఛోటా కే నాయుడు. అందరూ కష్టపడతారు.. కానీ ఈ సినిమాలో ఉన్న కష్టాలు వేరు. ఈ సినిమాని భోపాల్‌లో చేశాం.. అక్కడి వరకు చాలా బాగా చేశారు, అందరూ చాలా కోపరేట్ చేశారని జగపతి బాబు తెలిపారు.
భరద్వాజ గారిని, ఛోటాని చూస్తుంటే నేను చాలా నేర్చుకున్నా.. హెల్త్ విషయాల్లో కానీ, హార్డ్ వర్కింగ్‌లో కానీ. భరద్వాజగారు నైట్ కూర్చొంటే ఉదయం 7 అయినా, 8 అయినా యూత్‌లా అలాగే కష్టపడి ఈ వయసులో చేశారంటే ఆయన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఆయన ఆలోచనలు కూడా ఇంకా మోడ్రన్‌గానే ఉన్నాయి. ఛోటా కే నాయుడు.. ఛోటా కాదు.. ఆయన బడా కేటు నాయుడు. ఆయన వల్ల ప్రతిరోజూ మేం ఎంజాయ్ చేశాం. అందరూ కష్టపడ్డారు కానీ.. ఈ రోజు అందరి గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది. టెక్నీషియన్స్ కానీ, మన ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరూ ఎక్కడా ఒక్క కంప్లయంట్ కానీ, చిన్న ప్రాబ్లమ్ కానీ క్రియేట్ చేయలేదు. అందరూ రెడీగా ఉండేవారు.. అందరూ డ్రెస్స్‌ల్లో ఉండేవారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేవారు. చివరికి హీరోయిన్ల రెస్ట్ రూమ్స్, రూమ్స్ కూడా బాగుండేవి కావు.. అలాంటి పరిస్ధితుల్లోనూ హీరోయిన్లు అలాంటివి పట్టించుకోకుండా మాకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నారని జగపతిబాబు వెల్లడించారు.
లయ నాకు బాగా ఇష్టమైన హీరోయిన్. నాతో చేసినప్పుడు 17 ఏళ్లు.. బాగా చిన్నపిల్ల. అప్పటి నుంచి తను అంటే నాకు బాగా ఇష్టం. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేశాం. ఈ సినిమాలో తనకు రెండు సాలీడ్ సీన్స్ ఉంటాయి.. ఆ సీన్‌లో ఎప్పుడైతే ఒక శూర్పణఖ బయటకు వచ్చిందో అప్పుడు నేను కంగారుపడ్డా. ఆమని మేనకోడలు కూడా ఈ సినిమాలో చేసింది. ఆ పిల్ల కళ్లతో చంపేస్తుంది. షార్ట్ ఎప్పుడంటే అప్పుడు వచ్చేైసేది. షూటింగ్ టైంలో అందరం స్టూడెంట్స్ లాగే బిహేవ్ చేశామని జగపతిబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications

















