Salaar 2: ప్రభాస్ 'సలార్' గురించి జగపతి బాబు సరికొత్త లీక్.. ఫస్ట్ పార్టులో ఆ సీన్లు లేవట!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అలాంటిది ఇటీవల విడుదలైన ఆదిపురుష్ సినిమా అంతగా అభిమానులను సంతోషపెట్టలేదు. దీంతో ప్రభాస్ తర్వాతి సినిమాలపైన పడ్డారు ఫ్యాన్స్. ఇక డార్లింగ్ మాత్రం సినిమాల ఫలితాలు పట్టించుకోనంత బిజీగా మిగతా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో సలార్ ఒకటి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ను అందులో నటిస్తున్న సీనియర్ హీరో జగపతి బాబు లీక్ చేశారు. అదేంటంటే?

ఛత్రపతితో:లేట్ యాక్టర్ కృష్ణంరాజు వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా అడుగు పెట్టాడు ప్రభాస్. తన నటన, డ్యాన్స్, ఫైట్స్ అన్నిటికి మించి మ్యాన్లీ లుక్ తో అతి కొద్దిపాటి సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఛత్రపతి సినిమాతో క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ప్రభాస్.. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌ అయిపోయాడు.

Jagapathi Babu Reveals Prabhas Salaar First Part Movie Scenes

గంపెడు ఆశలు:బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ వరుసగా చేసిన పాన్ ఇండియా చిత్రాలు, సాహో, రాధేశ్యామ్ తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఇక ఇటీవల ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్న ఆదిపురుష్ సినిమా కూడా అదే బాటలోకి చేరి అభిమానులను మరోసారి గాయపరిచింది. దీంతో ప్రభాస్ తర్వాతి సినిమాలపైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్.

Jagapathi Babu Reveals Prabhas Salaar First Part Movie Scenes

జూలై 20న:దాదాపు పెద్ద డైరెక్టర్లతో సినిమాలు ప్లాన్ చేశాడు ప్రభాస్. ఇప్పుడు ఆయన చేతిలో ఏకంగా ఐదారు సినిమాలు ఉన్నాయి. వాటిలో ప్రాజెక్ట్ కె, సలార్, స్పిరిట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రాజెక్ట్ కె గురించి జూలై 20న కామికాన్ వేదికపై టైటిల్ రివీల్ చేయనున్నారు. ఇక సలార్ టీజర్ గ్లింప్స్ ఇటీవల విడుదల చేసి దానిపై హైప్ పెంచారు.

Jagapathi Babu Reveals Prabhas Salaar First Part Movie Scenes

సలార్ నటీనటులు:కేజీఏఫ్ తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుండగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడని టాక్. పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి, ఈశ్వరి రావు కూడా నటిస్తున్నారు. వీళ్లే కాకుండా సీనియర్ హీరో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Jagapathi Babu Reveals Prabhas Salaar First Part Movie Scenes

సలార్ 2:సలార్ సినిమాకు సంబంధించి జగపతి బాబు తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రభాస్ తో కలిసి తనకు ఎలాంటి సన్నివేశాలు లేవని, సలార్ ఫస్ట్ పార్టులో తాను ఉండట్లేదని స్పష్టంగా తెలియజేశారు. దీంతో సలార్ పార్ట్ 2 కూడా ఉండనుందని, దానికోసమే ప్రభాస్-జగపతి బాబు సీన్లను తీసినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X