For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లెజెండ్ విషయంలో మోసం చేశారు..నేను ఎందుకు ఎక్కి తొక్కించుకోవాలి?.. జగపతిబాబు

  |

  ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా చాలా సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు కెరీర్ అర్ధంతరంగా ముగిసిన పరిస్థితి. మళ్లీ ఆయన లెజెండ్ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నిలదొక్కుకున్నాడు.. అయితే జగపతిబాబు లెజెండ్ సినిమాలో చేసిన పాత్ర గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. లెజెండ్ లాంటి సినిమా మళ్లీ చేయను అని ఆయన చెబుతున్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. అసలు ఈ ఉదంతం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

   లెజెండ్ తో రీఎంట్రీ

  లెజెండ్ తో రీఎంట్రీ

  ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు హీరోగా ఫేడ్ అవుట్ అయిపోయారు. ఆ తర్వాత ఆయనకు అవకాశాలు దొరకని పరిస్థితుల్లో తాను ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నానని ఆయన చాలా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనను కొంత మంది చులకనగా కూడా చూసే వాళ్ళని ఆటో పంపిస్తాను షూటింగ్ కు రమ్మని కూడా ఫోన్లు చేసేవారని ఆయన తన బాధను వెళ్లగక్కారు. అలాంటి సమయంలో బోయపాటి శ్రీను లెజెండ్ సినిమాలో అదిరిపోయే పాత్ర ఇచ్చి తనను ఆదుకున్నారని ఆ సినిమా వల్లే నేను మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాణని కూడా ఆయన అనేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

  నాకు ఇష్టమైన సినిమా

  నాకు ఇష్టమైన సినిమా

  అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం తనకు లెజెండ్ సినిమాలో అన్యాయం చేసినట్లుగా ఆయన కామెంట్స్ ఉన్నాయి. రామ్-లక్ష్మణ్ మాస్టర్లు అలాగే యోగాకి సంబంధించిన పిరమిడ్ ధ్యాన కేంద్రాలు నడిపే పత్రీజీతో ఇంటర్వ్యూ ఉంది. ఆయన వ్యాఖ్యానించిన కామెంట్స్ ప్రకారం "నిజం చెప్పాలంటే ఈ లెజెండ్ సినిమాలో నాకు అన్యాయం జరిగింది, ఈ విషయం మీకు కూడా తెలుసు, మీ మనసుకు తెలుసు కానీ మీ డైరెక్టర్ మాటకు మీరు ఎదురు చెప్పలేదని రామ్ లక్ష్మణ్ మాస్టర్ లతో జగపతి బాబు అన్నారు. ఇప్పుడు దాన్ని దాటేసి వచ్చాను కాబట్టి నా టర్మ్స్ ప్రకారమే సినిమాలు చేస్తానని అన్నారు.. ఇకనుంచి డైరెక్టర్ గానీ మాస్టర్ కానీ ఎంత కన్విన్స్ చేసినా సరే నాకు ఇష్టమైన సినిమా నేను చేస్తానని అన్నారు.

  నేను ఎందుకు ఎక్కితొక్కించుకోవాలి?

  నేను ఎందుకు ఎక్కితొక్కించుకోవాలి?

  ఒకవేళ నచ్చకపోతే నేను చేయను అని పేర్కొన్న ఆయన నేను ఎందుకు కింద పడాలి ? నేను ఎందుకు వేరే వాళ్ల చేత ఎక్కితొక్కించుకోవాలి? నాకు చెప్పిన కథ వేరు, ఒక లయన్ టైగర్ మధ్య ఫైట్ అన్నారు తీరా చూస్తే ఇక్కడ జింకా లేదు కనీసం కుందేలుతో కూడా ఫైట్ చేసినట్టు లేదు అని అన్నారు. ఒకటి కొడితే ఆయన రియాక్ట్ కూడా అవ్వడని ఇలా పక్కకి తప్పుకుంటారు అని జగపతి బాబు చెప్పుకొచ్చారు. బాలకృష్ణ వచ్చినప్పుడల్లా జగపతిబాబు క్యారెక్టర్ బాలకృష్ణ రెండు కొడితే సైలెంట్ అయిపోతుందని జగపతి బాబు చెప్పుకొచ్చారు.

  ఇప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో

  ఇప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో

  పక్కనే ఉన్న పత్రీజీతో మాట్లాడుతూ ఇక మీదట ఇలాంటి సినిమా చేయకూడదని అప్పుడే అనుకున్నాను అని, నాకు నచ్చితే చేస్తానని లేకపోతే నేను చేయను అని అన్నారు. అది ఎవరైనా కానీ అదే పాలసీ ఫాలో అవుతాను అని చెప్పుకొచ్చారు. అయితే బోయపాటి మీద ఈ కామెంట్లు చేసింది ఇప్పుడు కాదు. ఈ వీడియో పత్రీజీ కి చెందిన పిరమిడ్ యూట్యూబ్ ఛానల్ లో గత ఏడాది అంటే 2020 వ సంవత్సరం ఆగస్టు 3వ తేదీన అప్లోడ్ అయింది. అప్పట్లో ఈ వ్యవహారం గురించి వెలుగులోకి రాలేదు కానీ ఇప్పుడు ఎందుకో అనూహ్యంగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియో ప్రకారం బాలకృష్ణ పాత్రను తాను కొట్టలేక పోయాను అనే బాధ ఆయనలో కనిపిస్తోంది.

  Bheemla Nayak Vs Acharya.. ఏమి సేతుర సామీ ! || Filmibeat Telugu
  అసలు సంగతి ఏంటంటే?

  అసలు సంగతి ఏంటంటే?

  అయితే ఇందులో జగపతి బాబు ని గాని బోయపాటి శ్రీను ని గాని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ముందు స్క్రిప్ట్ ప్రకారం అనుకున్నదే సినిమాగా చేయాలని ఎక్కడా లేదు ఎందుకంటే చాలా సినిమాలలో ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్ అనే కాన్సెప్ట్ ఉంది. సినిమా సెట్స్ మీదకు వెళ్ళాక అనేక మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు.

  బహుశా ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగి ఉండవచ్చు. ఇక్కడ కూడా జగపతిబాబు ఎవరినీ తప్పు పట్టలేదు లెజెండ్ సినిమా తనకు మంచి కెరీర్ గ్రాఫ్ ఏర్పరిచింది అని చెబుతూనే ఇకమీదట ఇలాంటి సినిమాలు వస్తే ఒప్పుకోను అని చెప్పుకొచ్చారు. అయితే కొంత మంది మాత్రం జగపతిబాబు వ్యాఖ్యలను అపార్థం చేసుకుంటూ బోయపాటి శ్రీను పిలిచి అవకాశం ఇచ్చి రెండో ఇన్నింగ్స్ ఇంత మంచిగా ఉండడానికి కారణం అయితే ఆయన మీద ఇలాంటి కామెంట్స్ చేస్తారా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

  అయితే ఇలా కామెంట్ చేస్తున్న వాళ్లు గమనించాల్సిన విషయం ఏమిటంటే జగపతిబాబు ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తూ ఉండడమే. సో ఈ పాత ఇంటర్వ్యూ క్లిప్ ని తీసుకువచ్చి వైరల్ చేసినంత ఏం ఉపయోగమో వారికే తెలియాలి.

  English summary
  Jagapathi Babu Sensational comments on Boyapati Srinu regarding legend movie. clip going viral on social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X