ఎన్టీఆర్ ఫోన్ చేసి తిట్టేవాడు.. మీ ముఖం చూపించద్దన్నాడు.. జగపతిబాబు సంచలనం!
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా చాలా సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు కెరీర్ అర్ధంతరంగా ముగిసిన పరిస్థితిలో ఆయన లెజెండ్ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నిలదొక్కుకున్నాడు.. అయితే అలాంటి ఆయన జూనియర్ ఎన్ఠీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. అసలు ఏం జరిగింది? ఆయన ఏమన్నారు? అనే వివరాల్లోకి వెళితే

లెజెండ్ తో రీఎంట్రీ
ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు హీరోగా ఫేడ్ అవుట్ అయిపోయారు. ఆ తర్వాత ఆయనకు అవకాశాలు దొరకని పరిస్థితుల్లో తాను ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నానని ఆయన చాలా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇలాంటి సమయంలో బోయపాటి శ్రీను లెజెండ్ సినిమాలో అదిరిపోయే పాత్ర ఇచ్చి తనను ఆదుకున్నారని ఆ సినిమా వల్ల నేను మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని కూడా ఆయన అనేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది
ఇటీవల ఆయన ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా గురించి, అందులో చేసిన బసి రెడ్డి పాత్ర గురించి, హీరో ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 'అరవింద సమేత వీర రాఘవ' స్క్రిప్ట్ బాగా కుదిరిందని, అందులో నాది ఎగ్రసివ్ క్యారెక్టర్ కానీ తారక్ ది చాలా కూల్ క్యారెక్టర్. దాంతో బసిరెడ్డి క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయిందని అన్నారు.

తిట్టేవాడు..
అసలు తారక్ లాంటి పెద్ద హీరో నా పాత్ర ఒప్పుకోవడం కష్టం కానీ ఆయన ఒప్పుకున్నాడు అందుకే తారక్ యాటిట్యూడ్ బాగా నచ్చిందని అన్నారు. అయితే బసిరెడ్డి పాత్రను ఒప్పుకున్న తారక్.. తర్వాత నాకు కావాల్సినంత పనిష్‌మెంట్ కూడా ఇచ్చేశాడని ఆయన అన్నారు. అదేమిటి అని అడిగితే షూటింగ్ సమయంలో రోజూ ఫోన్ చేసి వాయించేవాడని చెప్పుకొచ్చారు. నీ పాత్ర ఇంత బాగుంది. అంత బావుందని అనే వాడు. అంతే కాక రక రకాలుగా ప్రేమతోనే తిట్టేవాడు.. అని ఆయన చెప్పుకొచ్చారు.

దూరం పెడుతున్నానని
ఇక సినిమా విడుదల తర్వాత జరిగిన ఫంక్షన్‌లో కూడా నా పాత్ర గురించి మాట్లాడుతూ ఈ సినిమా చూసిన వారికి ముందు బసిరెడ్డి గుర్తుంటాడు. తర్వాతే నేను గుర్తుంటాను అన్నాడు. తను అలా అనడం చాలా పెద్ద స్టేట్‌మెంట్ అని కూడా జగపతి బాబు వెల్లడించారు. ఇక అప్పుడే ఆ తర్వాత నన్ను దూరం పెడుతున్నానని చెప్పాడని అన్నారు.

మీ ముఖం చూపించకండి
'బాబు మీకు.. నాకు అయిపోయింది. మీతో ఇక చేయలేను. మీరు తారక్ తోనే ఆడుకుంటున్నారు కుదరదు. ఇక నాలుగైదేళ్లు మీ ముఖం చూపించకండి'అని తారక్ అన్నారని, దానికి నేను కూడా సరే తారక్ అన్నానని, అలా అయిపోయింది' అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. అంటే ఇంకా మూడు నాలుగేళ్ల పాటు వీరిద్దరి కాంబోలో సినిమాలు ఏవీ రావన్న మాట. చూడాలి అది ఎంతవరకు నిజం అనేది. చివరిగా జగపతి బాబు కీలక పాత్రలో నటించిన హీరో సినిమా సంక్రాంతికి విడుదలైంది.


Click it and Unblock the Notifications











