తారక్‌ను చూశాక మగాడంటే వీడేరా బుజ్జి అనిపించింది: జగపతి బాబు
తారక్‌తో నేను ఫస్ట్ షాట్ చేసినపుడు ఫైట్‌తో మొదలైంది. ఆ సిక్స్ ప్యాక్, బాడీ చూసి మగాడంటే వీడేరా బుజ్జి అనిపించాడు. ఒక సందర్భంలో త్రివిక్రమ్ ఓ డైలాగ్ రాశాడు... ఆ పొద్దు వాన్ని చూసినపుడు చావు చొక్కా లేకుండా తిరగాడినట్లు ఉంది బాల్ రెడ్డి అని.... ఈ డైలాగ్ టూమ్ అంటూ జగపతి బాబు వ్యాఖ్యానించారు.
త్రివిక్రమ్‌తో పని చేయాలని ఎప్పటినుండో ఉంది. నేను ఈ సినిమాలో ఉండాలనేది తారక్ ఐడియా. తారక్ చెబితే త్రివిక్రమ్ నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అది పక్కన పెడితే... త్రివిక్రమ్ ఈ సినిమాను కసితో, ఉడుకుతున్న రక్తంతో తీశాడు. ప్రతి ఆర్టిస్టును ఎలా ఛాలెంజింగా చూపించాడంటే ... ప్రతి ఒక్కరినీ అద్భుతంగా చూపించాడు... అని జగపతి బాబు చెప్పుకొచ్చారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాయలసీమ కుర్రాడు వీర రాఘవ పాత్రలో కనిపించబోతున్నారు. అరవింద పాత్రలో పూజా హెగ్డే నటిస్తోంది. ప్రేమ కథ చుట్టూ జరిగే ఫ్యాక్షన్ సినిమాలా ఇది ఉంటుందని తెలుస్తోంది.
'అరవింద్ సమేత' చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబుతో పాటు నాగబాబులు కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











