ఆర్జీవీ డిజాస్టర్ ఇచ్చిన తరువాత నిర్మాతను బ్రతికించిన శుభలగ్నం సినిమా!
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమా ప్రొడక్షన్ సంస్థలకు మంచి క్రేజ్ ఉంది. అలాంటి సంస్థలలో వైజయంతి మూవీస్ కి ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. 1975 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలను రూపొందించిన ఈ సంస్థను అశ్వినీదత్ విజయవంతంగా నడిపిస్తున్నారు. అయితే ఇటీవల శుభలగ్నం సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వింటేజ్ వైజయంతి వీడియో ద్వారా చెప్పారు జగపతిబాబు.
మొన్ననే జగదేక వీరుడు అతిలోక సుందరికి సంబంధించిన విశేషాలను చెప్పిన ఆ సంస్థ ఇప్పుడు కొత్త తరహాలో పాత రికార్డులను గుర్తు చేస్తోంది. టాలీవుడ్ లో ఒకప్పుడు బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ సినిమాల్లో శుభలగ్నం సినిమా ఒకటి. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గోవిందా గోవిందా డిజాస్టర్ తరువాత అశ్వినీదత్ తో సినిమా చేయడానికి అప్పట్లో ఏ దర్శకుడు కూడా ముందుకి రాలేదట.

ఆ సమయంలో ఫామ్ లో ఉన్న దర్శకుడు ఎస్వీ.కృష్ణా రెడ్డి వైజయంతి ఆఫీస్ కి ఫోన్ చేసి మరి మీతో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాను అని శుభలగ్నం సినిమాను రూపొందించారు. ఆ సినిమా సక్సెస్ కావడంతో వైజయంతి మూవీస్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది అని జగపతిబాబు బాబు ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications