‘అఖండ’లో ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్: హైలైట్ కాబోతున్న సీనియర్ హీరో పాత్ర
కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ను సొంతం చేసుకోవాలని ఆయన ఎంతో పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం తనకు గతంలో 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ విజయాలను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జత కట్టారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రమే 'అఖండ'. సూపర్ హిట్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.
'అఖండ' మూవీలో నందమూరి బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర ఇంటర్వెల్ ముందు కనిపిస్తుందట. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో సీనియర్ హీరో జగపతి బాబు కూడా నటిస్తున్నారట. ఆయన పాత్ర కూడా ఇంటర్వెల్‌కు ముందే రివీల్ అవుతుందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ చిత్రంలో ఆయన రోల్ ఎంతో హైలైట్‌గా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. అలా దాన్ని డిజైన్ చేశాడట బోయపాటి శ్రీను. గతంలో 'లెజెండ్' మూవీలో బాలయ్య.. జగపతి బాబు మధ్య భీకరమైన యాక్షన్ సీన్స్ పెట్టిన ఈ దర్శకుడు.. ఇందులో దాన్ని మించేలా డిజైన్ చేశాడని అంటున్నారు. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'అఖండ' మూవీలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. అలాగే, పూర్ణ, శ్రీకాంత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











