Salaar మూవీలో సీనియర్ హీరో రోల్ హైలైట్: ప్రభాస్‌ తర్వాత ఆయనకే ప్రాధాన్యం

కృష్ణం రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు ఆరడుగుల అందగాడు ప్రభాస్. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో విజయాలను అందకున్న అతడు.. టాలీవుడ్‌లో స్టామినాను నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' సిరీస్‌ నుంచి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ చిత్రంతో బాలీవుడ్‌తో సహా పలు ఇండస్ట్రీలకు పరిచయం అయిన అతడు.. ఆ తర్వాత వచ్చిన 'సాహో'తో మార్కెట్‌ను విస్తృతం చేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కించేస్తూ దూసుకుపోతున్నాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఏకంగా నాలుగైదు సినిమాలు చేస్తున్నాడు. అందులో రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న 'రాధే శ్యామ్' ఇప్పటికే షూట్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో వాయిదా పడిపోయింది. ఇక, ప్రస్తుతం అతడు చేస్తోన్న చిత్రాల్లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న 'సలార్' ఒకటి. కేజీఎఫ్ చిత్రంతో తన స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలైంది. అంతేకాదు, దీనికి సంబంధించిన రెండు షెడ్యూళ్లు కూడా పూర్తయ్యాయి.

Jagapati Babu Role Highlight in Prabhass Salaar Movie

క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న 'సలార్' మూవీ రెగ్యూలర్ షూటింగ్ మొదలై చాలా రోజులే అవుతోన్నా.. ఇందులో నటించే నటీనటుల గురించిన వివరాలను మాత్రం చిత్ర యూనిట్ వెల్లడించలేదు. కేవలం ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తుందని మాత్రమే గతంలో తెలిపింది. దీంతో ఈ సినిమా అప్‌డేట్ల కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో కమ్ విలన్ జగపతి బాబు నటిస్తున్నట్లు కూడా ఆ మధ్య తెలిపారు. అంతేకాదు, అతడి క్రూరమైన లుక్‌కు సంబంధించన పోస్టర్‌ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

'సలార్' మూవీలో జగపతి బాబు చేసే పాత్రకు సంబంధించిన ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ, ఇందులో అతడి పాత్ర మాత్రం హైలైట్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో జగపతి బాబు రోల్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుందట. ఒకరకంగా చెప్పాలంటే ప్రభాస్ తర్వాత అతడి పాత్రే ఎక్కువ సేపు ఉంటుందని తెలిసింది. ఇదే విషయాన్ని తాజాగా ఈ సీనియర్ హీరో కూడా వెల్లడించారు. తాను ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో 'సలార్'లో పాత్రే బాగుంటుందని చెప్పారు. దీంతో ఇందులో జగపతి బాబు రోల్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫుల్‌ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఇందులో జ్యోతిక, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందని ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X