ప్రభాస్ ‘సలార్’లో మరో తెలుగు హీరో: లుక్ టెస్ట్ కూడా పూర్తి చేసుకున్న స్టార్
కెరీర్ ఆరంభంలోనే టాలీవుడ్ లెవెల్ చిత్రాలతో సత్తా చాటి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అదే సమయంలో కొన్ని కోట్ల మంది అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇక, దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' సిరీస్ నుంచి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ చిత్రంతో బాలీవుడ్‌తో సహా పలు ఇండస్ట్రీలకు పరిచయం అయిన అతడు.. ఆ తర్వాత వచ్చిన 'సాహో'తో నేషనల్ స్టార్ అయ్యాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కించేస్తూ దూసుకుపోతున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఏకంగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న 'రాధే శ్యామ్' ఇప్పటికే షూట్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. అతడు చేస్తోన్న మరో మూడు చిత్రాల్లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న 'సలార్' ఒకటి. కేజీఎఫ్ చిత్రంతో తన స్టామినాను దేశం మొత్తం చూపించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలైంది. ఇప్పుడు హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీని గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

'సలార్' మూవీ రెగ్యూలర్ షూటింగ్ మొదలై చాలా రోజులే అవుతోన్నా.. ఇందులో నటించే నటీనటుల గురించిన వివరాలను మాత్రం చిత్ర యూనిట్ వెల్లడించలేదు. కేవలం ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తుందని మాత్రమే తెలిపింది. దీంతో ఈ సినిమా అప్‌డేట్ల కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో కమ్ విలన్ జగపతి బాబు నటిస్తున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో ఆయన ఎంతో కీలకమైన పాత్రను పోషిస్తున్నారని తెలుస్తోంది. సినిమా మొత్తం ట్రావెల్ అయ్యే రోల్ అది అని అంటున్నారు.

ఇప్పటికే జగపతి బాబు పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్‌ను కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ పూర్తి చేసేశారనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూల్‌లోనే ఆయన చిత్ర యూనిట్‌తో కలవబోతున్నారని కూడా తెలిసింది. ఇక, ఇందులో ఆయన స్టైల్ ఎంతో కొత్తగా ఉంటుందని అంటున్నారు. తన గత చిత్రాల మాదిరిగానే ఇందులో జగపతి బాబు పాత్రను సరికొత్తగా డిజైన్ చేశాడట ప్రశాంత్ నీల్.
ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సలార్' మూవీ 1970 యుద్ధానికి సంబంధించిన కథతో తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రలను చేస్తున్నాడని.. అందులో ఒకటి తండ్రి పాత్ర కాగా, రెండోది కొడుకు రోల్ అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. ఇందులో జ్యోతిక, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. అలాగే, ఓ స్టార్ హీరోయిన్ ఇందులో స్పెషల్ సాంగ్ చేస్తుందనే టాక్ బాగా వినిపిస్తోంది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Click it and Unblock the Notifications











