ఎవరూ ఊహించని పాత్రలో జగపతిబాబు.. మరీ ఇంత క్రూరంగానా.!
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'లెజెండ్'లో విలన్‌గా నటించిన తర్వాత జగపతిబాబు కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. అప్పటి నుంచి ఈ విలక్షణ నటుడు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడం సహా పలు భాషల్లో నటిస్తున్నారు. దీంతో తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
తాజాగా ఆయన మరో ప్రాజెక్టుకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇది సినిమాకు కాదు.. వెబ్ సిరీస్‌కు. అవును.. టాలీవుడ్‌లో వరుస ఫ్లాప్ చిత్రాలతో సినిమాలకు దూరమైన మెహర్ రమేశ్ తెరకెక్కించబోయే వెబ్ సిరీస్‌లో జగపతి బాబు ఊహించని పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. కథ డిమాండ్ మేరకు ఇందులో మహిళలను కామ దృష్టితోనే చూసే లాయర్ పాత్రలో ఆయన నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర ఎంతో క్రూరంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం జగ్గూ భాయ్ రెమ్యూనరేషన్‌గా భారీ మొత్తం తీసుకుంటున్నాడని టాక్.

జగపతి బాబు గతంలో అమేజాన్ ప్రైమ్ రూపొందించిన 'గ్యాంగ్‌స్టర్' అనే వెబ్ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దీని ప్రేరణతోనే తెలుగులో పలు వెబ్ సిరీస్‌లు కూడా వచ్చాయి. అందులో జగపతి బాబు పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది. అన్నింటినీ లెక్కలు వేసుకునే మెహర్ రమేశ్ సిరీస్‌లో జగపతి బాబును తీసుకుంటున్నారని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జగ్గూ భాయ్ కొన్ని చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటికి సంబంధించిన షూటింగ్ పూర్తయిన వెంటనే ఇందులో పాల్గొంటాడని టాక్.


Click it and Unblock the Notifications











