పవన్ కళ్యాణ్ పుట్టినరోజు స్పెషల్‌గా ‘జై సేన’ సాంగ్ రిలీజ్ చేసిన నాగబాబు!
శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో, శ్రీ కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్‌లను ఇతర ప్రధాన పాత్రల్లో పరిచయం చేస్తూ దర్శకుడు వి సముద్ర రూపొందిస్తున్న చిత్రం 'జైసేన'. వి విజయలక్ష్మి సమర్పణలో వి సాయి అరుణ్‌కుమార్ నిర్మాతగా శివ మహతేజా ఫిల్మ్స్ బ్యానర్‌లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను మెగా బ్రదర్ నాగబాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వి సముద్ర, సహ నిర్మాత సిరిష్ రెడ్డి, హీరోలు శ్రీ కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్ పాల్గొన్నారు.
'హలో మిత్రామా... జై సేన.. మా స్టూడెంట్స్ పవరేంటో తెలిపే సేన' అంటూ సాగే పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేశారు.

మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ, "శివ మహతేజా బ్యానర్‌లో దర్శకుడు సముద్ర చేస్తున్న చిత్రానికి 'జై సేన' అని పేరు పెట్టారు. ఈ చిత్రంలో యువకులు చాలా మంచి పాత్రలు పోషించారు. శ్రీకాంత్, సునీల్ ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తారు. పాట చూసిన తర్వాత యువత, రాజకీయాలకు సంబంధించిన సినిమా అని తెలుస్తోంది. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్'' అన్నారు. శ్రీకాంత్, లీడ్ రోల్స్ లో సునీల్. శ్రీ కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్‌లను హీరోలుగా పరిచయం చేస్తున్నారు.
ఈ చిత్రంలో అజయ్ ఘోష్, మధు, ఆజాద్, ధన్రాజ్, వేణు, చమ్మక్ చంద్ర మరియు ఇతరులు ఇతర ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. సంభాషణలు: తిరుమలశెట్టి సుమన్, పార్వతి చంద్, సాహిత్యం: అభినయ్ శ్రీను, సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్, డాన్స్: అమ్మ రాజశేఖర్, అజయ్, ఫైట్స్: కనల్ కన్నన్, నందు, రవివర్మ, కెమెరా: వాసు, కో-ప్రొడ్యూసర్స్: పి సిరిష్ రెడ్రిన్ , నిర్మాత: వి సాయి అరుణ్‌కుమార్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వి సముద్ర


Click it and Unblock the Notifications











