జేమ్స్‌బాండ్ గర్ల్ కన్నుమూత.. విషాదంలో హాలీవుడ్ ప్రముఖులు
జేమ్స్‌బాండ్ గర్ల్, హాలీవుడ్ నటి డయానా రిగ్ ఇకలేరు. వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం మరణించారు. డయానా రిగ్ వయసు 82 సంవత్సరాలు. 1960లో ప్రసారమైన బ్రిటన్ టీవీ సిరీస్ ది అవెంజర్స్ ద్వారా డయానా అత్యంత ప్రేక్షకాదరణను సంపాదించుకొన్నారు. ఆన్ హర్ మెజస్టీస్ సీక్రెట్ సర్వీస్ చిత్రంలో సీన్ కానరీతో కలిసి నటించారు.
డయానా రిగ్ మరణంపై ఆయన పీఆర్ వర్గాలు స్పందిస్తూ.. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకొన్న డయానా రిగ్ ఇక లేరు. ఆమె ప్రశాంతమైన మనసుతో ఈ లోకాన్ని వీడారు. ఆమె మరణం సమయంలో కుటుంబ సభ్యులు వెంట ఉన్నారు అని తెలిపారు.
డయానా రిగ్ తన కెరీర్‌లో హెబీవో రూపొందించిన గేమ్ ఆఫ్ థ్రోన్ చిత్రంలో ఒలేన్నా టైరెల్ పాత్రతో విశేషంగా ఆకట్టుకొన్నారు. ఈ తరం వారిని కూడా ఆమె తన నటనతో ఇంప్రెస్ చేశారు.

డయానా రిగ్ మరణంపై జేమ్స్ బాండ్ ట్విట్టర్ పేజీ సంతాపం ప్రకటించారు. డేమ్ డియానా రిగ్ మరణించారనే వార్త మమల్ని ఎంతో విషాదానికి గురి చేస్తున్నది. ఆన్ హర్ మెజస్టీస్ సీక్రెట్ సర్వీస్ చిత్రంలో తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకొన్నారు. జేమ్స్ బాండ్ పాత్రను పెళ్లి చేసుకొన్న ఏకైక నటిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకొన్నారు అని సంతాప ప్రకటనలో తెలిపారు.
డయానా రిగ్ మరణంతో విషాదంలో మునిగిపోయిన హాలీవుడ్ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.


Click it and Unblock the Notifications











