twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవతార్ 2: ఆ పనులన్నీ పూర్తయినట్లే.. జేమ్స్ కెమెరూన్ ఏమన్నారంటే..

    |

    ప్రపంచ వ్యాప్తంగా అత్యదిక వసూళ్లను అందుకున్న చిత్రాల్లో అవతార్ సినిమా ఒకటి. విజువల్ వండర్ అనే దానికి అసలైన అర్దాన్ని చూపించి, సినిమా కోసం కూడా సరికొత్త టెక్నాలజీని క్రియేట్ చేసిన దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఇక చాలా రోజుల తరువాత ఆ సినిమా సీక్వెల్స్ పై ఒక క్లారిటీ ఇచ్చారు. కరోనా వైరస్ భయపెడుతున్న సమయంలో అసలు సినిమాను ఎలా పూర్తి చేస్తున్నారు అనే దానిపైన చాలా రోజులుగా ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. ఫైనల్ గా అన్ని విషయాలపై ఆయన వివరణ ఇచ్చారు.

    Recommended Video

    Avatar Seaquls Update : Avatar 2 Complete, Avatar 3 Nearly Done Filming: James Cameron || Oneindia
     హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు

    హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు

    2009లో వరల్డ్ వైడ్ గా విడుదలైన అవతార్ సినిమా దాదాపు అన్ని భాషల్లో అనువాదమైంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వారికు ప్రతి ఇండస్ట్రీలో ఆ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మొదట టైటానిక్ సినిమాతో అత్యదిక వసూళ్లను అందుకున్న జేమ్స్ కామెరూన్ ఆ తారువత మళ్ళీ తన రికార్డును అవతార్ తో బ్రేక్ చేశాడు. ఎవెంజర్స్ ఎండ్ గేమ్ విడుదలకు ముందు వరకు అవతార్ కలెక్షన్స్ లో (2.79 బిలియన్ డాలర్లతో) మొదటి స్థానంలో కొనసాగింది.

    కరోనా వైరస్ అడ్డుకట్ట వేసింది.

    కరోనా వైరస్ అడ్డుకట్ట వేసింది.

    ఇక 2014లో రావాల్సిన అవతార్ 2 వాయిదాల మీద వాయిదాలు పదుతూనే వచ్చింది. మరో మూడు సీక్వెల్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పి దర్శకుడు న్యూ టెక్నాలజీని సృష్టించడం కోసం మరింత సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక 2021లో డిసెంబర్ లోనే అవతార్ 2 రావాల్సి ఉండగా కరోనా వైరస్ అడ్డుకట్ట వేసింది.

    షూటింగ్ పూర్తయ్యింది.. కానీ

    షూటింగ్ పూర్తయ్యింది.. కానీ

    ఇక ఫైనల్ గా అవతార్ 2ను 2022 డిసెంబర్ కి షిఫ్ట్ చేసినట్లు జేమ్స్ కెమెరూన్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం అభిమానులకు కొంత వరకు నిరాశకు గురి చేసింది. ఒక విధంగా సినిమా వస్తుందేమో అనే కన్ఫ్యూజన్ కి పైనల్ క్లారిటీ రావడమే మంచిదైంది. ఇక అవతార్ 2 షూటింగ్ ని కూడా ఇటీవల పూర్తి చేసినట్లు దర్శకుడు వివరణ ఇచ్చారు. అదే విధంగా అవతార్ 3 షూటింగ్ కూడా దాదాపు 95శాతం పూర్తయినట్లు చెబుతున్నారు.

    షూటింగ్ అక్కడ జరగడమే మంచిదైంది..

    షూటింగ్ అక్కడ జరగడమే మంచిదైంది..

    ఇక ప్రపంచంలో కరోనా వైరస్ సినిమా పరిశ్రమలను ఏ స్థాయిలో దెబ్బ కొట్టిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అవతార్ షూటింగ్ ని న్యూజిలాండ్ లో చేయడం తమకు చాలా మంచి జరిగిందని ఎన్నో ఏళ్ల కిందటే షూటింగ్ ని ఈ దేశంలోనే చేయాలని నిర్ణయించుకున్నామని దర్శకుడు తెలిపారు. ఎందుకంటే న్యూజిలాండ్ కరోనాను పూర్తిగా కట్టడి చేయగల దేశంగా నిలిచింది. మేము ఇక్కడ చాలా సాధారణంగా ఎటువంటి ఆటంకం లేకుండా దైర్యంగా షూటింగ్ పనులనీ పూర్తి చేసుకుంటున్నట్లు జేమ్స్ కెమెరూన్ వివరణ ఇచ్చారు.

    English summary
    Avatar is one of the highest grossing films worldwide. James Cameron is the director who showed the true meaning of Visual Wonder and created the latest technology for the film as well. Several days later he gave a clarification on the movie sequels. For days there has been a confusion over how the original film was being completed at a time when the corona virus was threatening. He gave an explanation on all matters as a finale.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X