Avatar 3: నీవు పిలిస్తే వారణాసి సెట్‌కు వస్తా.. నీవు చేసే మ్యాజిక్ చూడాలని ఉంది.. రాజమౌళితో జేమ్స్ కామెరాన్

ప్రపంచంలోనే దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ డైరెక్షన్‌లో రూపొందిన అవతార్: ఫైర్ అండ్ యాష్. అవతార్ సినిమా సీక్వెల్‌లో మూడో చిత్రంగా వస్తున్న ఈ చిత్రాన్ని జేమ్స్ కామెరాన్, జాన్ లండావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సామ్ వర్తింగ్డన్, జో సల్దానా, సిజర్నీ వీవర్, స్టీఫాన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, ఊనా చాప్లిన్ తదితరులు నటిస్తున్నారు.

అవతార్3 సినిమాకు సంబంధించిన సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫిని, సైమన్ ఫ్రాంగ్‌లెన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు స్టీఫెన్ రివికిన్, డెవిడ్ బ్రెన్నెర్, జాన్ రిఫ్యూ, జేమ్స్ కామెరాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.400 మిలియన్ల డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది.

James Cameron wish to visit SS Rajamouli s Varanasi Set

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల అమితాసక్తితో ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల వీక్షించారు. ఈ సినిమా గురించి ఎక్సైట్ అవుతూ దర్శకుడు జేమ్స్ కామెరాన్‌తో ఆన్‌లైన్‌లో సంభాషించారు. అవతార్ 3 సినిమా గురించి రాజమౌళి.. వారణాసి మూవీ గురించి జేమ్స్ కామెరాన్ ఇద్దరు చర్చించుకొన్నారు. సినిమాల గురించి వారిద్దరూ మనసు విప్పి మాట్లాడుకొన్నారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ వివరాల్లోకి వెళితే..

అవతార్ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా దేశాల్లో పర్యటించాను. రెండు రోజుల వెకేషన్ కోసం న్యూజిలాండ్ లోని నా ఇంటికి వచ్చాను. ఈ సినిమా రిలీజ్‌కు ముందు నాకు చాలా నెర్వస్‌గా ఉంది. మీరు వారణాసి సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు అనుకొంటాను. నీ సినిమా గురించి ఏవైనా విశేషాలు ఉంటే నాతో షేర్ చేసుకో. ఓ కొత్త సినిమా వచ్చేటప్పుడు నేను వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులతో చర్చిస్తూ ఉంటాను. సినిమాకు అది బాగా ఉపయోగపడతుుంది అని జేమ్స్ కామెరాన్ అన్నారు. దాంతో నాకు కూడా నా సినిమా రిలీజ్ సమయంలో చాలా నెర్వస్‌గా ఉంటుంది. నేను సినిమా గురించి మీకు విశేషాలు చెబుతాను అని రాజమౌళి బదులిచ్చారు.

అవతార్ 3 సినిమాను సుమారుగా 1.3 బిలియన్ ప్రేక్షకులు చూడటానికి ఉవ్విలూరుతున్నారు. కానీ అవతార్ యాష్ అండ్ ఫైర్ సినిమాను మొట్టమొదటగా చూసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అని రాజమౌళి అన్నారు. సినిమా విషయంలో ఫిల్మ్ మేకర్స్ మాట్లాడుకోవడం చాలా అవసరం. క్రియేటివ్ అంశాలను, మైండ్‌లో ఉండే ఒకే రకమైన ఐడియాలను షేర్ చేసుకోవడం మంచింది. వారణాసి షూటింగ్‌ సెట్‌కు రావాలని ఉంది. సెట్‌లో మీరు చేసే మ్యాజిక్‌ను చూడాలని ఉంది అని జేమ్స్ కామెరాన్ అన్నారు. మీరు అడగడం.. మాకు చాలా గర్వకారణం. మీలాంటి వారిని ఎప్పుడూ స్వాగతిస్తాం. మీరు ఎప్పుడైనా రావొచ్చు. మీరు వస్తారంటే.. నేనే కాదు. నా చిత్ర యూనిట్.. మా సినిమా పరిశ్రమకు గర్వకారణం అని రాజమౌళి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X