Jana Nayagan: విజయ్ దళపతి మూవీపై భారీ అంచనాలు.. బాలకృష్ణ మూవీకి పక్కా రీమేకేనా?

తమిళ సినీ ఇండస్ట్రీలో దళపతి విజయ్ అంటేనే ఓ బ్రాండ్. తన కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చిన ఆయన, ఇప్పుడు సినీ ప్రస్థానానికి ముగింపు పలుకుతూ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న చివరి సినిమా "జన నాయగన్ (Jana Nayagan)" పై అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఊహించని హైప్ నెలకొంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌, ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల కావడంతో భారీ రెస్పాన్స్ వస్తోంది. సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యాయి.ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఏంటీ?

రాజకీయ ప్రవేశానికి ముందు దళపతి చేస్తున్న ఈ సినిమా ఆయన నటుడిగా తీసుకునే చివరి ప్రాజెక్ట్ కావడంతో, దీనిపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. 'జన నాయగన్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు హెచ్. వినోద్. ఆయన గతంలో అజిత్‌తో చేసిన "తీన్", "వాలిమై", "తునివు" సినిమాల ద్వారా యాక్షన్ డ్రామాలకు తెరకెక్కిన విషయం తెలిసిందే. అలాంటి సక్సెస్ పుల్ డైరెక్టర్.. విజయ్‌తో ఏ తరహా కథను చెప్పబోతున్నారో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Jana Nayagan Is Thalapathy Vijay s Final Film a Remake of Balakrishna s Bhagavanth Kesari

ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ సాంగ్ "దళపతి కచేరీ" యూట్యూబ్‌లో రికార్డులు బద్దలుకొడుతూ మిలియన్ల వ్యూస్ సంపాదించింది. ఈ పాట విజయ్ ఎనర్జీ, మాస్ ప్రెజెన్స్‌ను మరోసారి చూపించింది. కానీ పాట కంటే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది ఒక రూమర్. "జన నాయగన్ బాలకృష్ణ 'భగవంత్ కేసరి' రీమేక్‌నా?" అనే ప్రశ్న.

ఈ అనుమానం మొదట టీజర్ విడుదల సమయంలోనే మొదలైంది. టీజర్‌లో విజయ్ లుక్, యాక్షన్ సీన్స్‌, డైలాగ్ డెలివరీ ఇవన్నీ బాలకృష్ణ "భగవంత్ కేసరి"లోని స్టైల్‌ను గుర్తు చేశాయి. ఇప్పుడు "దళపతి కచేరీ" పాటతో ఈ చర్చ మరింత వేడెక్కింది. విజయ్ లుక్, డ్రెసింగ్, స్టైల్ చూస్తే.. రీమేక్ అన్న అనుమానానికి బలం చేకూరుతోంది. అయితే సినిమా టీమ్ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేసింది. "మేము కేవలం 'భగవంత్ కేసరి'లోని కొన్ని ఐడియాలు, సన్నివేశాల హక్కులు మాత్రమే కొనుగోలు చేశాం. కానీ ఇది పూర్తి రీమేక్ కాదు. కథ పూర్తిగా ఒరిజినల్" అని క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా అభిమానులు మాత్రం "సాంగ్ చూస్తే దాదాపు అదే కథలా ఉంది" అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

విజయ్ అభిమానులు మాత్రం ఈ రీమేక్ చర్చను పెద్దగా పట్టించుకోవడం లేదు. వారి దృష్టి మాత్రం దళపతి చివరి సినిమా ఎంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందనేదానిపైనే ఉంది. హెచ్. వినోద్ దళపతిని తనదైన స్టైల్లో, పక్కా మాస్, పొలిటికల్ టోన్‌తో చూపించబోతున్నారని టాక్. విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమాకు పొలిటికల్ షేడ్స్ ఎక్కువగా ఉండొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. 'జన నాయగన్'లో ఆయన ఒక లీడర్‌గా, ప్రజల కోసం పోరాడే వ్యక్తిగా కనిపించే అవకాశం ఉందని చెప్పబడుతోంది. "దళపతి కచేరీ" పాటలో కూడా ఆయన ప్రజల మధ్య, సభ వాతావరణంలో కనిపించడం దీనికి సంకేతంగా మారింది.

ఇదెలా ఉంటే.. విజయ్ లాంటి పెద్ద స్టార్ తన చివరి సినిమాగా ఒక రీమేక్ కథను ఎంచుకున్నాడనే ప్రచారం కొంతమందిని నిరాశపరిచినా, ఎక్కువ మంది అభిమానులు మాత్రం భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే, వినోద్ దర్శకత్వం అంటే కథలో భావోద్వేగం, రియలిస్టిక్ టచ్ ఉండటం ఖాయం. దళపతి ఇమేజ్‌కు తగిన మాస్ యాక్షన్ ప్యాకేజ్‌తో ఈ సినిమా రావడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. కేవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు దళపతి రూ.200 కోట్లకుపైగా రెమ్యునరేషన్ పొందుతున్నట్లు సమాచారం. ఇది ఆయన స్టార్ పవర్‌ను మరింతగా నిరూపిస్తోంది.

'జన నాయగన్'పై ఉన్న అంచనాలు చూస్తుంటే, ఇది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. రీమేక్ అయినా కాదా అన్నది పక్కన పెడితే, దళపతి విజయ్ చివరి సినిమా కాబట్టి, ఈ చిత్రంపై అభిమానుల్లో ఉత్సాహం మామూలుగా లేదు. మొత్తానికి,'భగవంత్ కేసరి' రీమేక్ చర్చ కొనసాగుతూనే ఉన్నా, "జన నాయగన్" రాజకీయ నేపథ్యంతో, భావోద్వేగ టచ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సినిమా విడుదలయ్యాకే ఈ రూమర్‌కి ఫుల్ స్టాప్ పడుతుంది. అలాగే.. సంక్రాంతి బాక్సాఫీస్‌ను దళపతి షేక్ చేయడం పక్కా అన్ని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X