Thalapathy Vijay’s Jana Nayagan Trailer Review: జన నాయగన్ ట్రైలర్ రివ్యూ

కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్ నటించిన జన నాయగన్ సినిమాపై దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారేందుకు గాను సినిమాలకు దళపతి గుడ్ బై చెప్పడంతో జన నాయగన్ చిత్రం.. ఆయన సినీ కెరీర్‌లో చివరి సినిమా కానుంది. జనవరి 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఎలా ఉంది? అభిమానుల అంచనాలను అందుకుందా? లేదా? పరిశీలిస్తే..

Jana Nayagan Trailer Review Thalapathy Vijay s Powerful Political Action Drama Creates Massive Buzz

జనవరి 9న జననాయగన్
జన నాయగన్ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మమితా బైజు, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, రెబా మోనికా జాన్, మోనిషా బ్లెస్సీ, నిళగల్ రవి, రేవతి, శ్రీకాంత్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీలో టాప్ ప్రొడక్షన్ కంపెనీగా ఉన్న కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కేలు జన నాయగన్ మూవీని దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్, అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

3 భాషల్లో ట్రైలర్ విడుదల
జన నాయగన్ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఇప్పటికే మలేషియాలో నిర్వహించిన ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి రికార్డు స్థాయిలో అభిమానులు పోటెత్తారు. తాజాగా జనవరి 3వ తేదీన ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగులో జన నాయకుడుగా, హిందీలో జననేతగా ఈ సినిమా విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను ఒకసారి గమనిస్తే..

అతన్ని టచ్ చేయొద్దు
2.52 నిమిషాల నిడివితో జన నాయకుడు ట్రైలర్ విడుదల చేశారు. తొలుత తుపాకులు, ఇతర ఆయుధాల డెన్‌లో ఉన్న ఓ వ్యక్తికి ఫోన్ వస్తుంది. అందులో పెద్దాయన ఒక పేరు పంపాను. వాడెవడో ఏంటో కనుక్కుని చెప్పమని అవతలి వ్యక్తి చెబుతాడు. ఆ పేరు చూడగానే ఆ పెద్దాయనకు చెమటలు పడతాయి. పంబరెగ్గొట్టే వాడి గురించి విని ఉంటావు.. అందులో రికార్డ్ ఉన్నవాడి పేరు విన్నావా? అతనే దళపతి. ముట్టుకోకు ముక్కలు చేసేస్తాడు అంటూ దళపతి విజయ్‌ని యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో చూపించారు.

దేశభక్తి, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో
ఆ తర్వాత అంత మందిని కొట్టావే.. నువ్వు సూపర్‌మెన్‌వా? అని ఓ చిన్నారి అడుగుతుంది. నేను సాధారణ మేన్‌ని బేబీ, కానీ చేసే పనులన్నీ సూపర్‌గా ఉంటాయని చెబుతారు అంటాడు విజయ్. ఆ తర్వాత ఆడపిల్లకి భయం ఉండకూడదని, విజ్జిని పులిలాగా పెంచుతానని చెబుతాడు. ఈ క్రమంలోనే మమితా బైజుకి బాక్సింగ్‌లో ట్రైనింగ్ ఇస్తాడు విజయ్. ఇక పవర్‌ఫుల్ విలన్‌గా బాబీ డియోల్ ఎంట్రీ అదిరిపోతుంది. జైళ్లో సైన్యాన్ని గేమ్ ఆడిన విధంగా చంపేస్తాడు బాబీ. ఇప్పటి నుంచి 30వ రోజున ఇండియా నా కాళ్ల కింద ఉంటుందని తన గ్యాంగ్‌కి చెబుతాడు. ఇండియానే కాపాడుకుంటూనే, దేశంలోని రాజకీయాలపై ప్రక్షాళన చేసేలా విజయ్ పోరాటం సాగుతుందని ట్రైలర్‌లో చూపించారు.

భగవంతి కేసరి ఛాయలు
నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి జన నాయగన్ రీమేకా? కాదా? అన్న అనుమానాల నేపథ్యంలో ట్రైలర్‌లో ఆన్సర్ ఇచ్చేందుకు దర్శకుడు హెచ్ వినోద్ ప్రయత్నించాడు. మమితా బైజుని ఆర్మీకి సిద్ధం చేయడం, ఆమె మిలటరీకి వెళ్లడానికి ఇష్టపడకపోవడం, కొన్ని యాక్షన్ సీన్స్ భగవంత్ కేసరిలో నుంచి కాపీ కొట్టినట్లుగానే కనిపిస్తోంది. అయితే వినోద్ తన మార్క్‌ని చూపించినట్లుగా కనిపిస్తోంది. సముద్రంలో కంటైనర్ షిప్ మీద ఎటాక్ చేయడం సహా ఏడెనిమిది భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నట్లుగా ట్రైలర్‌లో హింట్ ఇచ్చారు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందు చేసిన చివరి సినిమా కావడంతో ప్రస్తుత రాజకీయాలపై దళపతి చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ అదిరిపోయాయి.

దళపతి వన్‌మెన్ షో
ఇది పూర్తిగా దళపతి విజయ్ వన్‌మెన్ షో అని ట్రైలర్ చూసినవారికి అనిపించకమానదు. తనదైన మేనరిజమ్స్, డ్యాన్స్, ఫైట్స్, నటనతో విజయ్ అదరగొట్టాడు. స్టైలీష్ విలన్‌గా బాబీ డియోల్ స్క్రీన్ ప్రెజెన్స్ వయ్‌లెంట్‌గా ఉంది. పూజా హెగ్డే, మమితా బైజులు తమ పరిధి మేరకు రాణించినట్లుగా తెలుస్తోంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ప్రదీప్ ఎడిటింగ్ స్కిల్స్ ఈ సినిమాను గ్రాండ్‌గా చూపిస్తున్నాయి. మరి దళపతి విశ్వరూపం ఎలా ఉంది? రాజకీయాలపై ఆయన ఏం చెప్పారు? తెలియాలంటే జనవరి 9 వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: jana nayagan thalapathy vijay
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X