Jana Nayagan vs Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి'కి జననాయగన్ కాపీనా? ఆ సీన్స్ మక్కీ మక్కీ దించేశారుగా..

Jana Nayagan vs Bhagavanth Kesari: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి సినిమా జన నాయకుడు(Jana Nayagan) (తమిళంలో జన నాయగన్) ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టిన విజయ్‌కు ఇదే ఆఖరి సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లోనే కాదు, సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఈ సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) కి కాపీనా? రీమేకేనా? అనే ట్రోలింగ్ జరుగుతోంది.

సక్సెస్ పుల్ డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. అనిరుధ్ సంగీతం అందించగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించగా, మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి లాంటి భారీ తారాగణం ఉంది. జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Jana Nayagan vs Bhagavanth Kesari

ట్రైలర్‌లో కనిపించే అంశాలు చూస్తే.. 'భగవంత్ కేసరి'ని గుర్తుకు తెచ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్‌గా హీరో పరిచయం కావడం, ఫ్రెండ్ కూతురిని (లేదా తన సంరక్షణలో ఉన్న అమ్మాయిని) ఆర్మీ ఆఫీసర్‌గా తయారు చేయాలనే లక్ష్యం, ఆ అమ్మాయి మొదట ఆర్మీకి వెళ్లడానికి నిరాకరించడం, ఆ తర్వాత కఠినమైన శిక్షణ ఇవ్వడం, అడవుల్లో విలన్లతో యాక్షన్ ఫైట్స్, హీరో జైలుకు వెళ్లే సన్నివేశాలు, ఇంటర్వెల్ దగ్గర హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్... ఇవన్నీ 'భగవంత్ కేసరి'లో చూసినవే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

'భగవంత్ కేసరి'లో జైలర్ మరణం తర్వాత అతని కూతురు విజ్జిని ఒక ధైర్యవంతురాలైన ఆర్మీ ఆఫీసర్‌గా తీర్చిదిద్దడమే బాలయ్య పాత్ర లక్ష్యం. ఇక్కడ విలన్‌గా అర్జున్ రాంపాల్ కనిపిస్తే.. 'జన నాయకుడు'లో ఆ స్థానాన్ని బాబీ డియోల్ భర్తీ చేశారు. శ్రీలీల స్థానంలో మమితా బైజు కనిపిస్తున్నారు. పాత్రల పేర్లు, నటీనటులు మారినా, స్టోరీ లైన్ మాత్రం ఒకటేనని నెటిజన్లు స్క్రీన్‌షాట్లతో పోల్చి చూపిస్తున్నారు.

అయితే 'జన నాయకుడు'ని పూర్తిగా కాపీ అనడం కూడా తొందరపాటు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. దర్శకుడు హెచ్ వినోద్ మార్క్‌కి తగ్గట్టుగా ఈ సినిమాలో రాజకీయ కోణాన్ని మరింత బలంగా చూపించినట్లు ట్రైలర్ స్పష్టత ఇస్తోంది. రాకెట్ లాంచర్లు, డ్రోన్లు, సైన్స్ ఫిక్షన్ టచ్‌తో కూడిన యాక్షన్ సీక్వెన్స్‌లు, దేశ రాజకీయాలపై డైరెక్ట్ కామెంట్స్ ఈ సినిమాను 'భగవంత్ కేసరి' నుంచి కొంత వేరుచేస్తున్నాయని చెప్పొచ్చు.

ముఖ్యంగా విజయ్ చెప్పే రాజకీయ డైలాగ్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. 'ప్రజలకు మంచి చేస్తానంటూ ఇందులోకి రాకు... నిన్ను నువ్వు కాపాడుకుని పారిపో', 'అర్హతలేని వాళ్లంతా కలిసి నిలబడ్డారు... వాళ్లు గెలవకూడదు', 'నిన్ను నాశనం చేస్తాను అని ఎవడు చెప్పినా... తిరిగి వెళ్లే ఐడియానే లేదు... ఐ యామ్ కమింగ్' వంటి హై ఓల్టెజ్ డైలాగ్స్ కేవలం సినిమాలో కాకుండా, విజయ్ రియల్ లైఫ్ రాజకీయ ఎంట్రీకి సంకేతాలు అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఈ రీమేక్ వివాదంపై 'భగవంత్ కేసరి' దర్శకుడు అనిల్ రావిపూడి కూడా గతంలో స్పందించారు. ఇది విజయ్ సినిమా అని, రిలీజ్ అయ్యే వరకు అలాగే ట్రీట్ చేద్దామని కామెంట్స్ ద్వారా, కథ హక్కులు కొనుగోలు చేసి అధికారికంగానే ఈ సినిమా తెరకెక్కినట్లు సంకేతాలు ఇచ్చారు.

ఫైనల్‌గా ట్రైలర్ ఆధారంగా చూస్తే 'జన నాయకుడు' అనేది 'భగవంత్ కేసరి'కి రీమేక్ అన్న వాదనలో చాలా వరకు నిజం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే విజయ్ చివరి సినిమా కావడం, రాజకీయ కోణాన్ని జోడించడం, హెచ్. వినోద్ ఇంటెన్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ సినిమా ఎంతవరకు కొత్త అనుభూతిని ఇస్తుందో చూడాలి. ఈ పోలికలన్నింటికీ పూర్తి క్లారిటీ రావాలంటే.. జనవరి 9న సినిమా విడుదలయ్యే వరకు ప్రేక్షకులు వేచి చూడక తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X