Jani Master Case: ‘ జానీ మాస్టర్ ఫేమే అతనికి శాపంగా మారింది’
Jani Master Case: టాప్ స్టార్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు కావడం రెండు రాష్టాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎంతో మంది స్టార్ హీరోస్,హీరోయిన్స్ దగ్గర పని చేసిన జానీ మాస్టర్ ఓ మహిళ డ్యాన్సర్ పై లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు.. ఏకంగా ఆయనను పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది సినీ, రాజకీయ ప్రముఖులు, మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ క్రమంలో జానీ మాస్టర్ వివాదంపై జనసేన కార్యకర్త, సుప్రీంకోర్టు న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర షాకింగ్ కామెంట్స్ చేశారు.
జానీ మాస్టర్ వివాదంపై జనసేన కార్యకర్త, సుప్రీంకోర్టు న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర స్పందించారు. ఈ విషయంలో రాజకీయ కోణం ఉందనడం సరికాదు. కేవలం ఆరోపణలకు, ఊహాగానాలకు మాత్రమే బాగుంటాయని, అందులో ఎలాంటి వాస్తవాలేవని అన్నారు. ఒక జానీ మాస్టర్ ను టార్గెట్ చేస్తే.. జనసేన పడిపోతుందడంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. ఆయన కేవలం కార్యకర్త మాత్రమేనని, ఒక్క కార్యకర్తను టార్గెట్ చేస్తే పార్టీ కూలిపోయే పరిస్థితి లేదని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారెని టార్గెట్ చేయాలనుకుంటే.. పవన్ కళ్యాణ్ చేస్తారు గానీ, వేరే కార్యకర్త ను టార్గెట్ చేస్తారా? అని ప్రశ్నించారు.

'ఈ వివాదంలో జానీ మాస్టర్ పేరే తనకి శాపంగా మారింది. దేశవ్యాప్తంగా ఎన్నో రేప్ కేసులు, పోక్సో కేసులు నమోదవుతాయి. ఎక్కడ లేని అటెన్షన్ జానీ మాస్టర్ వివాదంలోనే ఎందుకు వచ్చింది. ఓ అనామకుడికి ఇదో ఆనందం. డేటా ఫ్రీగా వచ్చినప్పుడే నుంచి కామెంట్స్ చేసేవారు. పనికి రాని విషయాలపై ఆసక్తి చూపించేవారు ఎక్కువయ్యారు. ఈ విషయంలో నిజానిజాలు తెలియకుండా.. జానీ మాస్టర్ మీద గానీ, ఆ అమ్మాయి మీద గానీ కామెంట్స్ చేసేవారి సంఖ్య పెరిగింది. సోషల్ మీడియాలో ఇష్టాను సారంగా కామెంట్స్ చేయడం తప్పు 'అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర .
జానీ వివాదంలో అల్లు అర్జున్ ఇన్వాల్వ్ అవుతున్నారా? అని ప్రశ్నించగా.. 'ఈ వివాదంలో అంత పెద్ద స్టార్ ఉన్నారనే అవాస్తవం, ఆ అమ్మాయికి అవకాశాలు ఇచ్చారని కూడా పుకార్లు మాత్రమే. ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించిన దాఖలు లేవు. ఆయన సినిమాలు ఆయనవి. అల్లు అర్జున్ ఇదో ఇన్వాల్వ్ అయ్యారంటే..ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఓ కొరియోగ్రాఫర్ ను టార్గెట్ గా చేశారనేది. అమ్మాయికి సపోర్టుగా నిలిచారనేది తప్పుడు ఆరోపణలే'నని న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర అన్నారు.

'కాకపోతే..యూనియన్ లోనే జానీమాస్టర్ చాలా మంది శత్రువులున్నారు. ఇటీవల కాలంలో ఆయన మెగా ఫ్యామిలీకి దగ్గర అవడం. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేయడం. ఏ కొరియోగ్రాఫర్ తీసుకోలేనంత రెమ్యూనరేషన్ జానీ మాస్టర్ తీసుకోవడంతో తనకు ఇండస్ట్రీలో శత్రువులు అయ్యారు. అందుకే ప్రతి చిన్న విషయాన్ని పట్టుకుని, దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ అమ్మాయితో గేమ్ ఆడిస్తున్నారు' అని న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర షాకింగ్ కామెంట్స్ చేశారు.
'ఆరోపణలు వచ్చినంత మాత్రాన నిందితుడు దోషి అయిపోడు. కేసు నమోదు కాకనే పారిపోయాడు అనడం సరికాదు. ఏ వ్యక్తి అయినా.. తనపై కేసు నమోదైతే.. అందులో నుంచి ఎలా తప్పించుకోవాలి. అరెస్ట్ కాకుండా ఎలా ఉండాలని ఆలోచిస్తారు. చట్టపరం నడుచుకోవాలని చూసుకుంటారు. ఈ విషయం చట్టపరిధిలో ఉంది. నిజం తేలేనంత వరకు వేచి చూడాలి అప్పటి వరకూ ఎవర్ని దోషులు అనడానికి వీలు లేదన్నారు.అలాగే.. ఇది ఫెయిల్డ్ రిలేషన్ షిప్. ఆ విషయాన్ని చూస్తేనే అర్థమతోంది. కానీ, ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడు లైంగికంగా వాడుకుంటే మాత్రం ఆయనది తప్పు. శిక్షార్హుడు. కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ' షాకింగ్ కామెంట్స్ చేశారు కల్యాణ్ దిలీప్ సుంకర.


Click it and Unblock the Notifications











