పవన్ కళ్యాణ్ చుట్టూ పవర్ఫుల్ పహిల్వాన్‌లు.. ఒక్క మూమెంట్‌తో వాళ్లంతా ఫ్యాన్స్ అయిపోయారు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ వకీల్ సాబ్ సినిమాతో అభిమానులను సరికొత్తగా ఎట్రాక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. పింక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక నెక్స్ట్ అందరి ఫోకస్ - డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపైనే ఉంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ సినిమాపై పెరుగుతున్న బజ్ అంతా ఇంతా కాదు. ఇటీవల కొన్ని లొకేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అయ్యాయి. ఇక పవన్ ట్రీట్ చేసిన విధానానికి రీసెంట్ గా కొంతమంది పహల్వాన్ లు ఆయన ఫ్యాన్స్ అయిపోయారు

 హిస్టారికల్ మూవీలో 300ఏళ్ళు వెనక్కి

హిస్టారికల్ మూవీలో 300ఏళ్ళు వెనక్కి

క్రియేటివ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పవన్ 27వ సినిమా 17 శతాబ్దంలో జరిగే కథ అని తెలుస్తోంది. 300 ఏళ్ళ క్రితం నాటి భాగ్యనగరాన్ని అలాగే గండికోట వంటి చారిత్రాత్మక కట్టడాలను కూడా చూపించబోతున్నారు. గత ఏడాది కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోగా దర్శకుడు క్రిష్ సరికొత్త ప్లానింగ్ తో షెడ్యూల్స్ ని మళ్ళీ రెడీ చేసుకున్నాడు. సినిమాను 2022 సంక్రాంతి అనంతరం విడుదల చేయాలని అనుకుంటున్నారు గాని ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు.

టైటిల్ ఫిక్స్ అయినట్లే..

టైటిల్ ఫిక్స్ అయినట్లే..

ఇక మూవీకి మొట్టమొదట విరూపాక్ష అనే టైటిల్ ని సెట్ చేసుకున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే దర్శకుడు దాన్ని కేవలం వర్కింగ్ టైటిల్ గానే అనుకున్నాడు. రీసెంట్ గా హరిహర వీరమల్లు, హరహర మహాదేవ అనే టైటిల్స్ పై కూడా కథనాలు వచ్చాయి. జానపద సినిమాలను తలపించేలా కథను సెట్ చేసుకున్న క్రిష్ ఇంకా ఆ టైటిల్ ని అయితే పూర్తిగా ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం ఆ విషయంపై కూడా చర్చలు జరుపుతున్నారు. మార్చ్ 11న ఫస్ట్ లుక్ టైటిల్ పై క్లారిటీ ఇవ్వనున్నారు.

 బలమైన పహిల్వాన్ లతో

బలమైన పహిల్వాన్ లతో

రీసెంట్ గా కొన్ని ఫైట్ సీన్స్ కోసం షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. బలమైన పహిల్వాన్ లతో పవన్ వీరోచిత పోరాటాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సీన్స్ సినిమాలో హైలెట్ గా ఉంటాయట. లొకేషన్స్ కు సంబంధించిన అనేక రకాల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే బాగానే వైరల్ అవుతున్నాయి. చూస్తుంటే యాక్షన్ సీన్స్ నెవర్ బిఫోర్ అనేలా ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

పహిల్వాన్ లకు పవన్ సన్మానం

పహిల్వాన్ లకు పవన్ సన్మానం

ఇక షూటింగ్ లో పాల్గొన్న మల్లయోధులు పవన్ కళ్యాణ్ కు చాలా ఈజీగా కనెక్ట్ అయ్యారు. వారిని ప్రత్యేకంగా పిలిచి సన్మానం కూడా చేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ ఇచ్చిన గౌరవానికి వారు అందరు నిమిషాల్లోనే అభిమానులు అయిపోయారు.

 లీకైన పవన్ లుక్..

లీకైన పవన్ లుక్..

ఇక ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ లుక్ అయితే ఒకటి లీక్ అయ్యింది. సోషల్ మిసియాలో ఇంకా అది వైరల్ అవుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ ఒక గజదొంగ పాత్రలో కనిపిస్తున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక పవర్ స్టార్ కాస్ట్యూమ్ కూడా 17వ శతాబ్దానికి తగ్గట్లుగానే ఉంది. పవర్ స్టార్ ఇలా మొదటిసారి కనిపిస్తుండడంతో ఒక్కసారిగా ఆ ఫొటో వైరల్ అయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X