చెప్పులు, చీపుర్లతో కొడతారు .. యాంకర్ శ్యామలకు థర్టీ ఇయర్స్ పృథ్వీ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ - కూటమి తరపున పలువురు సినీ ప్రముఖులు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. ఇక వైసీపీ తరపున ప్రచారం చేస్తున్న యాంకర్ శ్యామల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ల పేర్లను ప్రస్తావించకుండా పరోక్షంగా ఆవిడ అన్న మాటలతో ఇరుపార్టీల కేడర్ ఊగిపోతోంది. ఇప్పటికే ట్రోలింగ్‌తో శ్యామలా రెడ్డిని ఆడుకుంటున్నారు. ఈ లిస్ట్‌లోకి జనసేన నేత, సినీనటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ చేరారు.

జనసేన , టీడీపీ, బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తున్న పృథ్వీరాజ్ సోమవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ శ్యామల వ్యాఖ్యలపై స్పందించారు. నేను చేసిన లౌక్యం సినిమాలో ఆమె ఓ చిన్న క్యారెక్టర్ చేసిందన్నారు. రోజా , శ్యామల వంటి వారు వేర్వేరుగా మాట్లాడినా వెర్షన్ మాత్రం ఒకటేనని పృథ్వీరాజ్ మండిపడ్డారు.

janasena leader 30 years prudhvi raj strong counter to anchor syamala for her comments on pawan kalyan

విశాఖలో కాలినడకన తిరిగామని.. రెల్లి వీధి, మత్స్యకారులు నివసించే ఏరియాలు కాలుష్యంతో దుర్గంధపూరితంగా వున్నాయని ఆయన ఆరోపించారు. ఆ ప్రాంతాల్లో అడుగుతీసి అడుగు పెట్టడం కూడా కష్టమేని.. అలాంటి ఏరియాల్లోకి వచ్చి విశాఖపట్నం చాలా సుందర ప్రాంతమని కామెంట్ చేసిందని శ్యామల కనపడితే కొడతామని అక్కడి జనం అంటున్నారంటూ సెటర్లు వేశారు.

అవంతి శ్రీనివాస్ లాంటి వ్యక్తిని పక్కనపెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడతారా.. ఆవిడకు ఇచ్చిన పేమెంట్‌లో విశాఖపట్నం గురించి ఎక్కువ చెప్పమని అన్నారెమోనంటూ పృథ్వీ ఆరోపించారు. తనతో పాటు పనిచేసిన గౌతంరాజు కూడా వైసీపీ జెండా కప్పుకున్నారని.. పార్టీలో ఏం జరుగుద్దో తెలియక ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్నారు.

పదేళ్లు వైసీపీతో కాపురం చేశానని.. అదొక టెర్రరిస్టు శిక్షణా శిబిరమని థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ ఆరోపించారు. నెక్ట్స్ సినిమాటోగ్రఫి మంత్రి నువ్వేనని మనల్ని ఆకాశానికి ఎత్తేసి లాగేస్తారన్నారు. జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమం ఓ భ్రమని.. 11 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు.

రాళ్ల దాడి ఇన్సిడెంట్‌లో.. దొంగ కట్లు, స్టిక్కర్లలో సినిమాల్లో లేని డ్రామాను జగన్ క్రియేట్ చేశారని పృథ్వీరాజ్ ఆరోపించారు. జర్నలిస్ట్‌గా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌పై స్పందిస్తూ.. రెండేళ్లకోసారి రెన్యూవల్ చేయకుంటే మన ఆస్తి ఇతరులది అయిపోతుందట, దానిపై కోర్టుకెక్కడానికి కూడా వీళ్లేదని పృథ్వీరాజ్ మండిపడ్డారు. గతంలో తిరుపతి లడ్డూతో బస్సు ఎక్కితే బస్సు మొత్తం సువాసనలు వచ్చేదని.. కానీ ఇప్పుడు లడ్డూలో నాణ్యత లేదని ఆయన ఆరోపించారు.

ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మార్పు రావడం ఖాయమన్న పృథ్వీరాజ్.. చాలా జిల్లాలను కూటమి క్లీన్‌స్వీప్ చేస్తుందని, వార్ వన్ సైడే వుంటుందని జోస్యం చెప్పారు. మార్పు కోసం ఓటర్లు కూటమికి బ్రహ్మరథం పడతారని తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీ రెండు సీట్లు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పృథ్వీరాజ్ సవాల్ విసిరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X