For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vijay Devarakonda Marriage:విజయ్ దేవరకొండకు పెళ్లయిపోయింది.. జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్

  |


  అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి నట వారసురాలిగా ఆమె ముద్దుల తనయ జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి కూతురిలానే కాకుండా తనదైన శైలీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరాఠీ చిత్రం సైరాట్ మూవీకి హిందీలో రీమేక్ గా వచ్చిన దఢక్ చిత్రంతో తెరగేంట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల గుడ్ లక్ జెర్రీ సినిమాతో నేరుగా ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మిలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ హాట్ భామ. అయితే ఇటీవల జరిగిన ఓ ప్రమోషన్ కార్యక్రమంలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి గురించి షాకింగ్ విషయం చెప్పి అందరని ఆశ్చర్యపరిచింది జాన్వీ కపూర్.

  తనలోని నటిని బయటపెట్టిన జాన్వీ..

  తనలోని నటిని బయటపెట్టిన జాన్వీ..

  దివగంత నటి శ్రీదేవి ముద్దుల కూతురిగా దఢక్ మూవీతో హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనదైన శైలీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే దఢక్ సినిమా తర్వాత గుంజన్ సక్సెనా, ఘోస్ట్ స్టోరీస్, అంగ్రేజీ మీడియం, రూహి చిత్రాలతో తనలోని నటిని బయటపెట్టింది జాన్వీ కపూర్. ఆ తర్వాత సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార హిట్ మూవీ కోలమావు కోకిల రీమేక్ సినిమాలో నటించింది.

  డైరెక్ట్ ఓటీటీలో విడుదల..

  డైరెక్ట్ ఓటీటీలో విడుదల..

  తమళంలో సూపర్ హిట్ అయిన కోలమావు కోకిల సినిమాను నార్త్ ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా గుడ్ లక్ జెర్రీ అనే టైటిల్ తో రీమేక్ చేశారు. ఈ చిత్రం డైరెక్ట్ ఓటీటీలో విడుదలకాగా, దీంతో జాన్వీ కపూర్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు అయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోషూట్ లతో హడావిడి చేసే జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

  విజయ్ దేవరకొండ పెళ్లి విషయంపై..

  విజయ్ దేవరకొండ పెళ్లి విషయంపై..

  జాన్వీ కపూర్ చేతిలో ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న మిలి, మిస్టర్ అండ్ మిసెస్ మహి, బావల్, రూహ్ అఫ్జా, దోస్తానా 2, తక్థ్ తదితర బిగ్ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మిలి మూవీ ప్రమోషన్స్ లలో చాలా చురుగ్గా పాల్గొంటుంది జాన్వీ కపూర్. ఇందులో భాగంగానే ఇటీవల ఓ ఇంటర్వ్యూకి హాజరైంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి విషయంపై ఆసక్తికర సమాధానం ఇచ్చింది జాన్వీ కపూర్.

  పెళ్లి కానీ వాళ్లు ఎవరున్నారు..

  పెళ్లి కానీ వాళ్లు ఎవరున్నారు..

  ''ఒకవేళ మీ స్వయంవరం జరిగితే.. అందులో ఏయే హీరోలు ఉండాలని అనుకుంటున్నారు'' అని అడిగిన ప్రశ్నకు.. హృతిక్ రోషన్, రణ్ బీర్ కపూర్, టైగర్ ష్రాఫ్ అని చెప్పింది జాన్వీ కపూర్. రణ్ బీర్ కపూర్ కు పెళ్లయింది కాబట్టి ఇంకొకరి పేరు చెప్పమని హోస్ట్ కోరారు. దీంతో ఎవరి పేరు చెప్పాలి అని ఆలోచిస్తూ ''పెళ్లి కానీ వాళ్లు ఎవరున్నారు.. అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి'' అని జాన్వీ కపూర్ తెలిపింది.

  విజయ్ దేవరకొండ-రష్మిక మధ్య రిలేషన్ షిప్..

  విజయ్ దేవరకొండ-రష్మిక మధ్య రిలేషన్ షిప్..

  జాన్వీ కపూర్ అలా అనడంతో.. విజయ్ దేవరకొండ పేరును సజ్జెస్ట్ చేశారు హోస్ట్. దీంతో ''హి ఈజ్ ప్రాక్టికల్లీ మ్యారీడ్'' అని సమాధానం ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేసింది హాట్ ముద్దుగుమ్మ. జాన్వీ కపూర్ అలా ఆన్సర్ ఇవ్వడంతో ప్రాక్టీకల్లీ పెళ్లి అవడం ఏంటి.. దానికి వెనుక ఉన్న అర్థం ఏంటని అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా మధ్య రిలేషన్ షిప్ నడుస్తున్నట్లు వార్తలు తెగ వస్తున్న విషయం తెలిసిందే.

  మలయాళం హిట్ మూవీకి రీమేక్ గా..

  మలయాళం హిట్ మూవీకి రీమేక్ గా..

  ఈ నేపథ్యంలోనే జాన్వీ కపూర్ అలా చెప్పి ఉండొచ్చని అందరూ అనుకుంటున్నారు. కాగా ఇటీవల విజయ్ దేవరకొండతో నటించాలని ఉందని చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ తోపాటు పలువురు సెలబ్రిటీలు సైతం పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా జాన్వీ కపూర్ నటించిన మిలి చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. జాన్వీ తండ్రి బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా.. మలయాళం హిట్ మూవీ హెలెన్ కి రీమేక్ గా వస్తోంది.

  English summary
  Bollywood Beauty Janhvi Kapoor About Vijay Devarakonda Marriage And Says He Is Practically Married In Mili Movie Promotions
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X