"పుష్ప 2" కోసం "దేవర" బ్యూటీ ఫైట్ .. ఇచ్చి పడేసిన జాన్వీ కపూర్.. ఏమైందంటే?
ఈ ఏడాదిలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ప్రతీ పాన్ ఇండియా సినిమా దాదాపు సక్సెస్ ని చూశాయని చెప్పాలి. జనవరి నెలలో హను మాన్" మొదలుకొని ఇపుడు ఏడాది చివరిలో డిసెంబర్‌లో "పుష్ప 2" వరకు వచ్చిన చిత్రాలు భారీ హిట్ అయ్యాయని చెప్పాలి. కాగా మధ్యలో రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఎడి , మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలు కూడా ఎంతగానో అలరించాయి.
ఇలా దాదాపు అన్ని చిత్రాలు కూడా భాషా భేదాలు లేకుండా హిందీ సినిమాలో కూడా అద్భుతంగా రాణించగా ఇపుడు ఇపుడు పుష్ప 2 బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. అయితే థియేటర్స్ లోకి పుష్ప 2 విడుదల అంత సింపుల్ గా రాలేదని చెప్పాలి. ఓ పక్క పలు కాంట్రవర్సీలు ఇంకో పక్క టికెట్ ధరల విమర్శలు ఇలా చాలా రచ్చ నడుమ థియేటర్స్‌లో పుష్ప రాజ్ ఎంట్రీ ఇచ్చాడు.

అయితే పుష్ప 2 సినిమా పట్ల విడుదల అయ్యాక కూడా పలు విమర్శలు కొన్ని కామెంట్స్ ఉన్నాయి. మెయిన్ గా నార్త్ లో కొందరు పుష్ప 2ని టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తుండగా వీటిపై దేవర బ్యూటీ బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ స్పందించడం వైరల్ గా మారింది. ఓ పేజ్ లో పుష్ప 2 ఐమ్యాక్స్ వెర్షన్ రిలీజ్ కోసం హాలీవుడ్ చిత్రం "ఇంటర్ స్టెల్లార్" సినిమాకి ఇండియాలో స్క్రీన్స్ ఇవ్వలేదు అంటూ పుష్ప 2 చిత్రాన్ని చులకనగా చేస్తూ పెట్టిన పోస్ట్ పట్ల జాన్వీ కపూర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది.
పుష్ప 2 కూడా ఒక సినిమానే .. ఎందుకు వెస్ట్ సినిమాలతో పోలుస్తూ మన సినిమాని, మన దేశాన్ని ఎందుకు తక్కువ చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యింది. మీరు ఏదైతే రూటెడ్ అండ్ వెస్ట్రన్ సినిమాల కోసం అంటున్నారో వారే మన భారతీయ సినిమాలని మెచ్చుకుంటున్నారు. కానీ మనం ఇంకా మన చిత్రాలని తక్కువ చేసుకుంటూ మనల్ని మనమే అవమానించుకునే దగ్గరే ఉండిపోయాం, బాధగా ఉంది అంటూ జాన్వీ ఓ రేంజ్ లో ఇచ్చి పడేసింది.

జాన్వీ కపూర్ పుష్ప 2 కోసం తీసుకున్న స్టాండ్ చూసి అభిమానులు సహా ప్రతీ భారతీయుడు , ఇండియన్ సినిమా లవర్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి జాన్వీ కపూర్ మన తెలుగులో దేవర చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వగా ఈ చిత్రం తర్వాత ఇపుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో భారీ సినిమా , ఆ తర్వాత దేవర పార్ట్ 2 లలో నటించనుంది. ఈ బిగ్ ప్రాజెక్ట్స్ సహా తెలుగులో మరిన్ని అవకాశాలు ప్రస్తుతం జాన్వీ ముందు ఉన్నాయి. వీటికి సంబంధించి త్వరలోనే వివరాలు రానున్నాయి. ఇవి కాకుండా హిందీలో కూడా జాన్వీ పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











