NTR30: ఎన్టీఆర్ మూవీ నుంచి ఫస్ట్ లుక్.. ఆరోజే స్పెషల్ సర్‌ప్రైజ్
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించి స్టార్‌గా హవాను చూపిస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విజయాల పరంపరతో తన రేంజ్‌ను భారీ స్థాయిలో పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకున్నాడు. అలాగే, ఈ చిత్రంతో అతడు డబుల్ హ్యాట్రిక్‌ను కూడా పూర్తి చేశాడు. ఈ జోష్‌లో ఉన్న ఎన్టీఆర్.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమాను చేయబోతున్నాడు.
'జనతా గ్యారేజ్' వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ ప్రాజెక్టును ప్రకటించాడు. కానీ, ఇది అనుకున్న సమయానికి ప్రారంభం కాలేదు. దీంతో అసలు ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజులుగా ఈ మూవీ నుంచి వరుసగా ఆప్‌డేట్లు ఇస్తున్నారు. అలాగే, దీన్ని ఫిబ్రవరి 24వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, నందమూరి తారకరత్న మరణించడంతో దీన్ని వాయిదా వేశారు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ నుంచి ఓ అదిరిపోయే న్యూస్ లీకైంది.

జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాగా వస్తున్న ఇందులో అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు, ఈ చిత్రం కోసం ఆమె భారీ మొత్తాన్నే రెమ్యూనరేషన్‌గా తీసుకోబోతుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందని తెలిసింది. మార్చి 6వ తేదీన జాన్వీ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఆమె లుక్‌ను రివీల్ చేయబోతున్నారని అంటున్నారు.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











