HBD Janhvi Kapoor: ఎన్టీఆర్ మూవీ నుంచి సర్‌ప్రైజ్.. లంగావోణీలో ఏముంది బాసూ!
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా హవాను చూపిస్తూ.. RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకున్నాడు నందమూరి చిన్నోడు జూనియర్ ఎన్టీఆర్. ఈ ఉత్సాహంతోనే అతడు వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్నాడు. అందులో ఇప్పుడు బడా డైరెక్టర్ కొరటాల శివతో పాన్ ఇండియా సినిమాను చేయబోతున్నాడు. అయితే, ఇది ప్రకటించినా ప్రారంభం కాకపోవడంతో అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదా అని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీని నుంచి వరుసగా అప్‌డేట్లను ఇస్తూ పుకార్లకు పుల్‌స్టాప్ పెడుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించే ఈ పాన్ ఇండియా సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఎన్నో రకాల వార్తలు ప్రచారం అయ్యాయి. వాస్తవానికి ఈ చిత్రం కోసం ఆలియా భట్‌ను తీసుకున్నారు. కానీ, ఆమె అనివార్య కారణాలతో దీని నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఇందులో ఫలానా హీరోయిన్ నటిస్తుందని ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఇలా దీపికా పదుకొణె, శ్రద్దా కపూర్, మృణాల్ ఠాకూర్ ఇలా ఎంతో మంది హీరోయిన్లను అనుకున్నారు. కానీ, ఎన్టీఆర్‌కు జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుందని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తుందని తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈరోజు (మార్చి 6) ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. అంతేకాదు, ఇందుకోసం ఓ పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. ఇందులో జాన్వీ లంగావోణీలో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ ఫిదా చేసేస్తోంది. ఇక, 'తుఫానులో ప్రశాంతత' అనే ట్యాగ్‌తో ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుందో చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక, ఎన్టీఆర్ సరసన జాన్వీ నటిస్తుండడంతో వీళ్లిద్దరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు.


Click it and Unblock the Notifications











