NTR30: ఎన్టీఆర్ మూవీ నుంచి స్పెషల్ వీడియో.. ఎవరూ ఊహించని విధంగా!
నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సాంగ్స్ ఇలా అన్ని విభాగాల్లో రాణిస్తూ టాలీవుడ్‌లో స్టార్ హీరోగా దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోన్న అతడు.. మార్కెట్‌ను కూడా పెంచుకుంటోన్నాడు. దీనికితోడు ఇటీవలి కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న తారక్.. వరుస విజయాలతో సత్తా చాటుతోన్నాడు. ఈ క్రమంలోనే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకున్నాడు. దీంతో ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు.
RRR విడుదల కాకముందే కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ ప్రాజెక్టును ప్రకటించాడు. కానీ, ఇది ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అసలు ఈ సినిమా ఉంటుందా? క్యాన్సిల్ అయిందా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజులుగా ఈ మూవీ నుంచి వరుసగా ఆప్‌డేట్లు ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. అలాగే, దీన్ని ఫిబ్రవరి 24వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, నందమూరి తారకరత్న మరణించడంతో దీన్ని వాయిదా వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ నుంచి ఓ అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.

'జనతా గ్యారేజ్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు, ఈ చిత్రం కోసం ఆమె భారీ మొత్తాన్నే రెమ్యూనరేషన్‌గా తీసుకుంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్‌కు సంబంధించిన స్పెషల్ ఇంట్రడక్షన్ వీడియోను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందని తెలిసింది. మార్చి 6వ తేదీన జాన్వీ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఆమె లుక్‌ను రివీల్ చేయబోతున్నారని తాజాగా ఓ న్యూస్ లీకైంది.

పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











