RC16: రామ్ చరణ్ కోసం జూనియర్ అతిలోక సుందరి.. పోస్టర్‌తో మెగా సర్‌ప్రైజ్
టాలీవుడ్‌లోకి బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనదైన టాలెంట్లను బయటపెట్టుకుని బడా హీరోగా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీనికితోడు ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లను అందుకుంటూ తన రేంజ్‌ను పెంచుకున్న అతడు.. గ్లోబల్ స్టార్ అన్న బిరుదును అందుకున్నాడు. అప్పటి నుంచి ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోన్నాడు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. దీనిపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇక, ఈ సినిమా పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సనతో చేస్తున్నట్లు ప్రకటించాడు.

రామ్ చరణ్ - బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రాబోతున్న ఈ భారీ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని ఇప్పటికే సమాచారం బయటకు వచ్చింది. అంతేకాదు, ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నాడని కూడా లీకైంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
భారీ బడ్జెట్‌తో హై రేంజ్ కాన్సెప్టుతో రూపొందనున్న ఈ క్రేజీ సినిమాలో ఎంతో మంది బడా స్టార్లు నటించబోతున్నారు. ముఖ్యంగా ఇందులో పాన్ ఇండియా హీరోయిన్‌ను తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరో రివీల్ చేస్తూ పోస్టర్‌ను వదిలింది.

ముందు నుంచీ అనుకుంటున్నట్లుగానే ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారు. ఈరోజు ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ వెల్‌కం పోస్టర్‌తో సర్‌ప్రైజ్ చేసింది. ఇందులో 'RC16 కోసం ఖగోళ సుందరికి స్వాగతం. మెస్మరైజింగ్ బ్యూటీ జాన్వీ కపూర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని చెప్పుకొచ్చింది. ఆమె రాకతో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో రాబోయే ఈ సినిమా దాదాపు రూ. 400 కోట్లు బడ్జెట్‌తో రూపొందనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. దీనికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











