NTR30: ఎన్టీఆర్ కోసం జాన్వీ కపూర్ త్యాగం.. అన్ని కోట్లు ఇవ్వడం వల్లే ఇలా!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతేకాదు, ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఈ పేరు మారుమ్రోగుతోంది. అంతలా అతడు తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేయడంతో పాటు వరుస విజయాలతో సత్తా చాటుతోన్నాడు. మరీ ముఖ్యంగా RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో అతడి రేంజ్ విశ్వవ్యాప్తం అయిపోయింది. దీంతో ఎన్టీఆర్ మరింత ఉత్సాహంగా తన ఫ్యూచర్ ప్రాజెక్టులను తారక్ లైన్‌లో పెట్టుకుంటోన్నాడు. అందులో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న మూవీ ఒకటి.
స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించాడు. కానీ, ఈ మూవీ మాత్రం అనుకున్న సమయానికి ప్రారంభం కాలేదు. దీంతో ఈ ప్రకటనకే పరిమితం అయిందని వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ వరుసగా అప్‌డేట్లను ఇస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ఇక, ఈ చిత్రం పూజా కార్యక్రమం ఈ నెలలో, రెగ్యూలర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుందని 'అమిగోస్' ఈవెంట్‌లో ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీలో నటించే హీరోయిన్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను తీసుకున్నారని ఓ క్లారిటీ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఆమె ఓ బడా బాలీవుడ్ మూవీ ఆఫర్‌ను కూడా రిజెక్ట్ చేసిందట. దీనికి కారణం ఎన్టీఆర్ చిత్రానికి డేట్స్ కేటాయించడమే అని అంటున్నారు. వాస్తవానికి ఆమె ఈ చిత్రం కోసం ఏకంగా రూ. 3.50 కోట్లు చార్జ్ చేస్తుందని కూడా టాక్ వినిపిస్తోంది. అందుకే వేరే ఆఫర్‌ను వదిలేసిందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడీ న్యూస్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.
భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేసే ఛాన్స్ ఉంది. దీన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











