జాన్వీకపూర్ రెండో సినిమా ఫస్ట్‌లుక్ అదిరింది.. పేపర్ ఫ్లైట్ ఎగరేస్తూ శ్రీదేవి డాటర్
దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ రెండో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 'గుంజన్ సక్సేనా' అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'ది కార్గిల్ గర్ల్' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా తాజాగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఐఏఎఫ్ తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా తెరక్కెడుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ లీడ్ రోల్ పోషిస్తోంది. తాజాగా విడుదలైన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ఆమె పేపర్ ఫ్లైట్ ఎగరవేస్తున్నట్లుగా చూపించారు. ఈ లుక్ బీ టౌన్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అప్పట్లో కార్గిల్ యుద్ధం సమయంలో గాయపడిన వారి కోసం ప్రాణాలకు తెగించి పోరాడారు గుంజన్. ప్రమాదానికి గురైన వారిని తన విమానంలో తరలించి వారి ప్రాణాలను కాపాడారు. ఈమె కథనే డైరెక్టర్ శరణ్ శర్మ 'గుంజన్ సక్సేనా' సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు పంకజ్ కపూర్.. జాన్వి తండ్రి పాత్ర పోషిస్తుండటం విశేషం. వచ్చే ఏడాది మార్చి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి సినిమా 'ధడక్' తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ ఈ సినిమాతో స్టార్ స్టేటస్ కొట్టేస్తుందనే టాక్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











