Gunjan Saxena బయోపిక్ ట్రైలర్ రిలీజ్.. కార్గిల్ గర్ల్‌గా అదరగొట్టిన జాన్వీ కపూర్..

ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ నిర్మించిన చిత్రం గుంజన్ సక్సేనా - ది కార్గిల్ గర్ల్. దివంగత నటి శ్రీదేవి కూతురు, హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను పోషించారు. వైమానిక దళంలో తొలి పైలెట్‌గా కార్గిల్ యుద్ధంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన మహిళ పైలెట్ జీవిత గాథ ఆధారంగా గుంజన్ సక్సేనా చిత్రం తెరక్కెక్కింది. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, మానవ్ విజ్, వినీత్ కుమార్ సింగ్, అంగద్ బేడీ కీలక పాత్రలను పోషించారు.

గుంజన్ సక్సేనా సినిమాకు 2 నిమిషాల 41 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. వైమానిక దళంలో చేరాలంటే సైనికుల బంకర్లు చూడాలి. లేకపోతే ఇంటికి వెళ్లి వంటపనులు చేసుకో అంటూ డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. మహిళలు బట్టలు మార్చుకొనేందుకు గదులు లేవు అంటే.. ఎయిర్‌ ఫోర్స్‌లో మగవాళ్లకే ఉద్యోగాలు అంటూ చెప్పిన డైలాగ్స్ ఎమోషనల్‌గా ఉన్నాయి. కార్గిల్ యుద్ధం సమయంలో చిత్రీకరించిన సీన్లు ఆకట్టుకొనేలా ఉన్నాయి.

Janhvi Kapoors Gunjan Saxena The Kargil Girl trailer released

చిన్నతనం నుంచి పైలెట్ కావాలనే కోరికతో సైన్యంలో చేరిన గుంజన్ సక్సేనాకు ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి. 1999 కార్గిల్ యుద్దంలో గుంజన్ సక్సేనా ఎలాంటి పాత్ర పోషించారనేది సినిమా కథ.

గుంజన్ సక్సేనా బయోపిక్ ఆగస్టు 12వ తేదీన ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నది. ఈ క్రమంలో ప్రమోషన్‌లో భాగంగా గుంజన్ సక్సేనా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో జాన్వీ కపూర్ యాక్టింగ్‌ చూసి బాలీవుడ్ అగ్ర హీరోలు అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ తదితరులు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మేరకు ట్రైలర్‌ను ట్వీట్ చేసి విషెస్‌ను అందించారు.

ప్రతీ ఒక్కరి కలలు ఇలానే పైకి ఎగిరిని నింగిని అంటుకోవాలి. నిజమైన స్ఫూర్తిని నింపే గుంజన్ సక్సేనా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. యూనిట్‌కు నా అభినందనలు. రియల్ హీరో గుంజన్ సక్సేనా మరెందరికో స్ఫూర్తిని, ధైర్య సాహసాలు నింపేలా ఈ చిత్రం నిలువాలని ఆకాక్షిస్తున్నాను అని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X