'కండోమ్ యాడ్స్‌కి జాన్వీ కపూర్ బెటర్'
ప్రస్తుతం సౌత్ సహా నార్త్ లో కూడా తమ గ్లామర్ షోతో మత్తెక్కించే యంగ్ హీరోయిన్స్ చాలా మందే కనిపిస్తారు. ఇలా హిందీ నుంచి టాలీవుడ్ కి పరిచయం అయ్యిన మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన హాట్ బ్యూటీ ఎవరైనా ఉన్నారు అంటే అది జాన్వీ కపూర్ అనే చెప్పాలి. కాగా అలనాటి అందాల నటి శ్రీదేవి కూతురుగా హిందీలో పలు సినిమాలు చేసింది కానీ అక్కడ రాని బ్రేక్ మాత్రం మన తెలుగు సినిమాలో వచ్చింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సరసన తన మొదటి తెలుగు సినిమా సెట్ చేసుకొని రిలీజ్ కి వచ్చి, పరిచయం అయ్యిన మొదటి సినిమా తోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. కాగా జాన్వీ కపూర్ కి ఎందుకు ఇంత క్రేజ్ అంటే నటన పరంగా పక్కన పెడితే తన అందాల విందు మాత్రం అంతా ఇంతా కాదు. హాట్ నెస్ తో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని ఫాలోవర్స్ ని ఎప్పటికప్పుడు మత్తెక్కిస్తూ జాన్వీ కపూర్ ట్రీట్ ఇస్తుంది.

కాగా ఈ హాట్ నెస్ తోనే ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇపుడు జాన్వీ కపూర్ పై బాలీవుడ్ సినీ వర్గాల్లో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. కాగా చాలా మంది హాట్ మోడల్స్ ని ప్రముఖ కండోమ్(నిరోద్) సంస్థలు బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుంటారని తెలిసిందే. అయితే ఈ తరహా అడ్వటైజ్మెంట్ లలో స్టార్ హీరోలు లేదా హీరోయిన్స్ కనిపించడం అనేది చాలా చాలా అరుదుగా కనిపిస్తుంది.
మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ పలు కండోమ్ యాడ్స్ లో నటించింది కానీ ఇపుడు తమ కండోమ్ యాడ్స్ కి మాత్రం హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అన్నట్టుగా ప్రముఖ కండోమ్ బ్రాండ్ మ్యాన్ ఫోర్స్ ఫౌండర్ చేసిన హాట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. మ్యాన్ ఫోర్స్ ఫౌండర్ రాజీవ్ ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొనగా తమ బ్రాండ్ కి అయితే జాన్వీ కపూర్ సరిగ్గా సరిపోతుందని తన అభిప్రాయం చెప్పడం సోషల్ మీడియాలో చర్చకి దారి తీసింది.

దీనితో జాన్వీ కపూర్ హాట్ నెస్ పట్ల అతని ఇచ్చిన కితాబు కూడా ఇది కావచ్చని కొందరు అభిప్రాయం పడుతున్నారు కానీ ఒక్కసారిగా అలాంటి స్టార్ బ్యూటీపై ఈ తరహా ప్రోడక్ట్ విషయంలో చేసిన కామెంట్స్ మాత్రం ఊహించని విధంగా మారాయి. కాగా ఇదే పాడ్ కాస్ట్ లో రాజీవ్ మాట్లాడుతూ తమ కండోమ్ యాడ్స్ కి ఫీమేల్ లీడ్ లో జాన్వీ కపూర్ సెట్ అయితే మేల్ వెర్షన్ లో బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ సరిపోతాడు అని మరిన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
దీనితో ఈ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో నెటిజన్స్ మధ్య మంచి హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇవి పక్కన పెడితే జాన్వీ కపూర్ ఇపుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో భారీ సినిమా తెలుగులో చేస్తుంది. ఇవి కాకుండా హిందీలో కూడా పలు సినిమాలు జాన్వీ కపూర్ చేస్తుంది.


Click it and Unblock the Notifications











