Oscars 2026 Nominations: ఆస్కార్స్ 226 నామినేషన్స్ లైవ్ ఎక్కడంటే? బరిలో ఇండియా నుంచి జాన్వీ కపూర్ మూవీ!
సినిమా పరిశ్రమలో నోబెల్ అవార్డుగా భావించే ఆస్కార్ అవార్డుల పండుగకు రంగం సిద్దమైంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకొనేందుకు సినీ ప్రముఖులు సిద్దమవుతున్నారు. గతేడాది కాలంలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని నింపి.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలు ఈసారి అకాడమీ నామినేషన్స్ కోసం పోటీపడుతున్నాయి. ఈ సంవత్సరం అవార్డుల రేసులో పోటీ చాలా కఠినంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం (జనవరి 22వ తేదీ) సాయంత్రం 7 గంటల ప్రాంతంలో 98వ ఆస్కార్ అవార్డు నామినేషన్లను ప్రకటించేందుకు సర్వం సిద్దమైంది. వరల్డ్ వైడ్‌గా పోటీ పడే చిత్రాలు ఏమిటి? ఇండియా నుంచి ఆస్కార్‌పై కన్నేసిన సినిమాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే..
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆస్కార్ అవార్డులు 2026 నామినేషన్స్ లైవ్ కార్యక్రమాన్ని ఎక్కడ చూడొచ్చంటే?.. అవార్డుల ఈవెంట్‌ను ఆస్కార్.కామ్ (Oscar.com) లేదా ఆస్కార్.ఆర్ (Oscars.org) వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా చూడొచ్చు. అలాగే అకాడమీ అవార్డులకు సంబంధించిన యూట్యూబ్, ఇన్స్‌టాగ్రామ్, ఫేస్‌బుక్ ఛానెల్స్‌లో వీక్షించవచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రసారాన్ని జియో హాట్ స్టార్, స్టార్ నెట్‌వర్క్ ఛానెల్స్ చేయనున్నాయి.

24 కేటగిరిలో అవార్డుల నామినేషన్స్
ఆస్కార్ నామినేషన్స్ ఈవెంట్‌కు హాలీవుడ్ నటులు డెనీల్లే బ్రూక్స్, లివీస్ పుల్మాన్ ఇద్దరు హోస్టులుగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమం అకాడమీకి చెందిన బెవెర్లీ హిల్స్ ప్రధాన కార్యాలయం నుంచి ప్రసారం కానున్నది. మొత్తం 24 కేటగిరీలకు సంబంధించిన అవార్డులను ప్రకటించనున్నారు. ఈ సారి టాప్ యాక్టర్లు, డైరెక్టర్లు, టెక్నిషియన్స్ రేసులో ఉండే అవకాశం ఉంది. 98వ ఆస్కార్ నామినేషన్స్‌లో తొలిసారి కొత్త అవార్డును ప్రవేశపెడుతున్నారు. క్యాస్టింగ్ అవార్డును ఈ అవార్డుల్లో చేర్చారు.
రేసులో ఉన్న సినిమాలు ఇవే..
98వ అకాడమీ అవార్డుల రేసులో సిన్నర్స్ (Sinners) చిత్రానికి ఎక్కువ నామినేషన్స్ లభించే అవకాశం ఉంది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (One Battle After Another), ఫ్రాంకెన్‌స్టెయిన్ (Frankenstein), హ్యామ్‌నెట్ (Hamnet), F1 (ఎఫ్1), వెపన్స్, సూపర్ మ్యాన్, సెంటిమెంటల్ వాల్యూ, మార్టీ సుప్రీం, ది సీక్రెట్ ఏజెంట్, ఇట్ వాస్ జస్ట్ యాన్ యాక్సిడెంట్, ట్రైన్ డ్రీమ్స్ చిత్రాలు నామినేషన్స్ కోసం పోటీ పడే అవకాశం ఉంది అని సినీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
ఇండియా నుంచి జాన్వీ కపూర్ మూవీ
ఇండియా నుంచి ఆస్కార్ రేసులో జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా నటించిన హోంబౌండ్ చిత్రం నామినేషన్ సాధించే అవకాశం ఉంది. భారత్ నుంచి అధికారికంగా ఈ ఎంట్రీని పంపించడం జరిగిన విషయం తెలిసిందే. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ఈ సినిమా పోటీ పడేందుకు రెడీ అవుతున్నది.


Click it and Unblock the Notifications











