తప్పు చేయలేదు.. తప్పుడు ఆరోపణలతో కేసు.. జానీ మాస్టర్ కేసులో ట్విస్టు!
లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పరపల్లి కేసులో ప్రవేశపెట్టారు. బాధితురాలు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కోర్టు ఈ కేసును విచారించింది. అయితే ఈ కేసులో జానీ మాస్టర్ తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఆయన తన క్లయింట్ నిర్ధోసి, కుట్ర పూరితమైన, ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారు అని అని వాదనలు వినించారు. అయితే ఈ కేసులో ఏం జరిగిందంటే..
జానీ మాస్టర్‌పై మహిళా కోరియోగ్రాఫర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు. తొలుత రాయదుర్ఘం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత సంబంధిత నార్సింగి పోలీస్ స్టేషన్‌కు కేసు బదిలి చేశారు. దాంతో ఆయనపై సెక్షన్ 376 (రేప్), నేరపూరితంగా బెదిరింపులు (సెక్షన్ 506), ఉద్దేశపూర్వకంగా గాయపరచడం (323 సెక్షన్ (2) (N)) కింద కేసు నమోదు చేశారు. గోవాలో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.

అయితే జానీ మాస్టర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నా క్లయింట్ జానీ మాస్టర్ ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు. తనను కావాలనే ఇరికించారు. తనతో కొందరు కావాలనే ఫిర్యాదు చేయించారు. తన క్లయింట్ నిర్దోషి అని కోర్టుకు తెలియజేశారు.
జానీ మాస్టర్ న్యాయవాది వాదనలు విన్న తర్వాత.. బాధితురాలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీస్ కస్టడీ కావాలా? అని అడిగితే నార్సింగి పోలీసులు.. ఆధారాలు సేకరించాం. మాకు కస్టడీ అవసరం లేదు అంటూ చెప్పడంతో.. 14 రోజుల కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దాంతో జానీ మాస్టర్‌ను 14 రోజుల కస్టడీకి తరలించేందుకు రెడీ అయ్యారు. చంచల్ గూడ జైలుకు తరలించే ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే తాను తప్పు చేయలేదు. ధైర్యంగా న్యాయపోరాటం చేసి బయటకు వస్తానని తన సన్నిహితులతో జానీ మాస్టర్ తన ఆవేదనను పంచుకొన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











