జనసేనలోకి 30 ఇయర్స్ పృథ్వి, జానీ మాస్టర్... శ్యాంబాబు క్యారెక్టర్‌తోనే ప్రచారం!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం ఆసన్నమైంది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేవలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక పార్టీలో చేరికలు కూడా అధికం అవుతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీలోకి రాజకీయ ప్రముఖులు చేరుతుండగా.. ఇప్పుడు సినీ గ్లామర్ కూడా ఎక్కువగా అవుతుంది. తాజాగా పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోకి స్టార్ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విరాజ్, స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చేరారు. ఆ వివరాల్లోకి వెళితే...

కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌, సినీనటుడు పృథ్వీరాజ్‌ జనసేన పార్టీలో చేరారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో వీరు పార్టీలో చేరారు. వీరికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కల్యాణ్. జానీ మాస్టర్‌, పృథ్వీ చేరికపై పలువురు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.

Jani Master And 30 Years Industry Prudhvi Raj Joined in Pawan Kalyan Janasena Full Details Here

ఈ క్రమంలో సినీ నటుడు పృథ్విరాజ్ పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. టీడీపీ - జనసేన కూటమి తరపున చేపట్టాల్సిన ప్రచారంపై ఇరువురు చర్చించారు. శ్యాంబాబు క్యారెక్టరులోనే రాష్ట్రవ్యాప్త ప్రచారం చేపట్టాలని పృథ్విరాజ్ నిర్ణయించుకున్నారు. బ్రో సినిమాలో అంబటి రాంబాబుకు పేరడీ పాత్రను పృథ్వి పోషించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రపై అప్పట్లో వివాదాలు తలెత్తాయి.

Jani Master And 30 Years Industry Prudhvi Raj Joined in Pawan Kalyan Janasena Full Details Here

పృథ్వి రాజ్ పాత్రను పవన్ కల్యాణ్ బ్రో సినిమాలో కావాలనే పెట్టారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇక పృథ్విరాజ్.. పవన్ కల్యాణ్ తో భేటీ అనంతరం... రాష్ట్ర వ్యాప్తంగా శ్యాంబాబు క్యారెక్టర్ వేషధారణతో పర్యటిస్తానని వెల్లడించారు. శ్యాంబాబు వేషధారణతోనే టీడీపీ - జనసేన తరపున ప్రచారం చేస్తానని క్లారిటీ ఇచ్చారు. అందరూ కోరుకుంటే సత్తెనపల్లి నుంచే శ్యాంబాబు వేషధారణతో ప్రచారం ప్రారంభిస్తానని తెలిపారు.

ఇప్పటికే వార్ వన్ సైడ్ అయిందన్న 30 ఇయర్స్ పృథ్విరాజ్.. నేను ఏ టిక్కెట్ ఆశించడం లేదని... ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదని తెలిపారు. ఏ పదవీ ఆశించడం లేదని వెల్లడించారు. టీడీపీ - జనసేన ప్రభుత్వం రావడం ఖాయమని ప్రకటించారు. దూషణలు లేని ప్రచారం చేస్తామని చెప్పుకువచ్చారు. ఆలీ వైసీపీ తరపున ఉన్నా.. ఎవరి ప్రచారం వారిదేనని క్లారిటీ ఇచ్చారు.

మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శ్యాంబాబు క్యారెక్టర్ వేషధారణతో పర్యటిస్తానని అన్నారు. శ్యాంబాబు వేషధారణతోనే టీడీపీ - జనసేన తరపున ప్రచారం చేస్తానని పేర్కొన్న ఆయన అందరూ కోరుకుంటే సత్తెనపల్లి నుంచే శ్యాంబాబు వేషధారణతో ప్రచారం ప్రారంభిస్తానని అన్నారు. ఇప్పటికే వార్ వన్ సైడ్ అయిందని పేర్కొన్న ఆయన నేను ఏ టిక్కెట్ ఆశించడం లేదు.. ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదని అన్నారు.

మరోవైపు జానీ మాస్టర్ కూడా జనసేనలో చేరారు. జానీ మాస్టర్ ఏపీ నుంచి జనసేన అభ్యర్థిగా ఏదో ఒక చోట నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. . అందుకే ఆయన జనసేనలో జాయిన్ అయినట్లుగా సమచాారం. అయితే టీడీపీ-జనసేన పొత్తులో ఉన్న క్రమంలో జానీ మాస్టర్ కి ఎక్కడి సీటు దక్కుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X