అదంతా నిజం కాదు.. ఆరోపణలతో దోషి కాడు.. జానీ మాస్టర్ అరెస్ట్ నేపథ్యంలో నాగబాబు కామెంట్స్!
ఇండియాలోనే టాప్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంపై భిన్న రకాల వాదనలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది బాధితురాలికి అండగా నిలుస్తుండగా, మరికొంత మంది జానీ మాస్టర్‌కు సమర్ధిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం అత్యంత వివాదాస్పదం కావడంతో చాలా మంది ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ విషయంపై నాగబాబు కొణిదెల నర్మగర్భంగా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను మైనర్‌గా ఉన్నప్పటి నుంచే లైంగిక దాడి చేశాడు. తనను మత మార్పిడి చేసుకోమని బలవంతం చేశాడు. తనను లైంగికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేశారు.

అయితే జానీ మాస్టర్ మీద లైంగిక దాడి ఆరోపణలు రావడంతో జనసేన వెంటనే స్పందించింది. అయితే ఆరోపణలు వచ్చినందన్న తన పార్టీలో కీలక పదవిలో ఉన్న ఆయనపై పాక్షికంగా వేటు వేసింది. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. పార్టీ నేత అజయ్ కుమార్ ప్రకటనను విడుదల చేశారు.
ఇదిలా ఉండగా, జానీ మాస్టర్ అరెస్ట్ తర్వాత నటుడు, జనసేన నేత నాగబాబు ట్విట్టర్‌లో వరుసుగా పోస్టులు పెట్టారు. నీ చెవులకు వినేది ఎప్పటికి నమ్మకు. ప్రతీ స్టోరీకి ఎప్పుడూ మూడు కోణాలు ఉంటాయి. ఆ స్టోరికి సంబంధించిన వారి కోణం ఒకటి, మీ కోణం రెండు, ఆ సమస్యకు సంబంధించిన వాస్తవం, నిజం మూడో కోణం అని అన్నారు.

ఇక ఏ వ్యక్తి అయినా దోషి అని వెంటనే నిర్ణారించకూడదు. మహిళ, లేదా పురుషుడు గానీ కోర్టు చేత దోషిగా నిర్ధారించి తీర్పు ఇచ్చే వరకు అతడిని దోషిగా పరిగణించకూడదు అని సర్ విలియమ్ గ్యారోవ్ సూక్తిని కోట్ చేశారు. ఆయన ఎవరి పేరు చెప్పకపోయినా.. అది జానీ మాస్టర్‌ను ఉద్దేశించేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











