డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు... శేఖర్ మాస్టర్‌పై జానీ మాస్టర్ షాకింగ్ కామెంట్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మంచి దూకుడు మీదున్నారు కొరియోగ్రాఫర్లు .. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ కొరియోగ్రఫి చేసే స్థాయికి వీరు చేరుకుంటున్నారు. గతేడాది లైంగిక వేధింపుల కేసులో వివాదంలో చిక్కుకున్న జానీ మాస్టర్.. ఇప్పుడిప్పుడే తిరిగి యాక్టీవ్ అవుతున్నారు. ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తోన్న్న పెద్దిలో చికిరి చికిరి సాంగ్‌తో మరోసారి నేషనల్ వైడ్ పాపులర్ అయ్యారు జానీ.
డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య
మరోవైపు.. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లోనూ తన పట్టు నిలుపుకునేందుకు జానీ మాస్టర్ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (టీఎఫ్‌టీడీడీఏ) ఎన్నికల్లో తన సతీమణి సుమలత అలియాస్ అయేషాను పోటీకి నిలబెట్టి అద్భుత విజయాన్ని అందుకున్నారు. మొత్తం 510 ఓట్లకు గాను 439 ఓట్లు పోల్ అవ్వగా.. అందులో సుమలత 228 ఓట్లు పోలవ్వగా.... ఆమెకు ప్రత్యర్ధిగా నిలబడిన జోసెఫ్ ప్రకాశ్ మాస్టర్‌కు 199 ఓట్లు మాత్రమే లభించాయి. మరో అభ్యర్ధి చంద్రశేఖర్‌కు 11 ఓట్లు లభించగా.. దాదాపు 29 ఓట్ల తేడాతో సుమలత విజయం సాధించారు.

జానీ మాస్టర్‌కి సపోర్ట్ చేయని శేఖర్
అయితే సీనియర్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్, పొల్లకి విజయ్, జోజో శ్యామ్, చంద్రకిరణ్ తదితరులు జోసెఫ్ ప్రకాశ్ మాస్టర్‌కు బహిరంగంగా మద్ధతు తెలపడం తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. శేఖర్‌కు, జానీకి పడటం లేదని.. అందుకే ఆయన సుమలతకు మద్ధతు తెలపలేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా టీఎఫ్‌టీడీడీఏ ప్రెసిడెంట్‌గా సుమలత ప్రమాణ స్వీకారం గురువారం జరిగింది. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ తదితరులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
శేఖర్, గణేష్‌లపై జానీ మాస్టర్ వేడుకలు
ఇక్కడ శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్‌కి గ్రూపులు లాంటివి ఏం లేవు. శేఖర్, గణేష్, భాను, పొల్లకి, రఘు అన్నా చాలా ఇష్టం. అందరూ నాకు చాలా ఇష్టం. మేమంతా ఒకటే.. ఈరోజున వారు షూటింగ్స్ ఉండటం వల్ల వెళ్లారు తప్పించి వేరే ఏం లేదు. నేనొక్కడినే పాన్ ఇండియా మాస్టర్‌ని కాదు. అందరు మాస్టర్స్ కలిశారు కాబట్టే ఈరోజు మన ఇండియా దాటి వెళ్లి పాన్ ఇండియా, పాన్ వరల్డ్‌గా సాగుతున్నాం. దానికి నేనొక్కడినే కాదు.. అందరు మాస్టర్ల కృషి ఉంది అని జానీ మాస్టర్ పేర్కొన్నారు.
నా భార్య గెలిస్తే నేను గెలిచినట్లే
దానికి మించి ఈరోజు మేం ఇక్కడ ఉన్నాం అంటే అది ముక్కురాజు మాస్టర్ వల్లే. ఆయన గనుక ఈ యూనియన్ స్థాపించకపోతే, ఆ యూనియన్ ఇక్కడ లేకపోతే మేమంతా ఇక్కడికి వచ్చేవాళ్లం కాదు. ఆయనతో పాటు చాలా దగ్గరిగా నేను ఉండేది డ్యాన్సర్స్‌తోనే. డ్యాన్సర్స్‌కి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా చాలా థ్యాంక్స్. ఈరోజు ఇప్పటికీ యూనియన్ ఉందంటే మన ఫౌండర్స్ సోమరాజు గారు, వెంకటేష్ గారు అందరికీ థ్యాంక్స్. నాకు బ్యాక్‌బోన్‌గా నిలబడి నన్ను సపోర్ట్ చేసి నన్ను గెలిపించారు. డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, ఈరోజు ప్రెసిడెంట్‌గా నన్ను గెలిపించారు. నా భార్య గెలిస్తే నేను గెలిచినట్లే. శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారికి, రాము గారికి చాలా థ్యాంక్స్ అని జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











