Jani Master Case: లైంగిక వేధింపులు నిజమే.. ఈవెంట్ పేర్లతో దూర ప్రాంతాలకు తీసుకెళ్లి..
Jani Master Case: ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పై లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ అయినా జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్ పై బయటికి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు దర్యాప్తులో నార్సింగ్ పోలీసులు పలు విషయాలను నిర్ధారించుకున్నారు. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక ఆరోపణలు నిజమేనని,ఈవెంట్ల పేరుతో బాధిత లేడీ కొరియోగ్రాఫర్ ను వేరు వేరు సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్లి..
ఆ సందర్భంలో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ మేరకు జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.

టాలీవుడ్ లేడీ కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ 15న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఈ మేరకు పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసుకున్నారు. దీంతో జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్ళగా అతనిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి జానీ మాస్టర్ ని గోవాలో అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. అనంతరం సెప్టెంబర్ 20వ తేదీన ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా.. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తరువాత పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. చివరిగా అక్టోబర్ 25న బెయిల్ మంజూరు కావడంతో చంచల్ గూడా జైలు నుండి విడుదలయ్యారు.
ఇదిలా ఉంటే లైంగిక ఆరోపణల కేసులో అరెస్టు కారణంగా పుష్ప 2 సినిమాలో కొరియోగ్రఫీ చేసే అవకాశం కోల్పోయారు
జానీ మాస్టర్. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణల కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ కి జాతీయ అవార్డును హోల్డ్ లో పెట్టారు జోరీ మెంబర్స్. బెయిల్ పై వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడిప్పుడే సినిమాలతో మళ్లీ బిజీ అవుతున్నారు. సినిమాలకు ఆయన వర్క్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫీ చేసేందుకు జానీ మాస్టర్ కు అవకాశం కల్పించారు మూవీ మేకర్స్. అయితే తాజాగా జానీ మాస్టర్ పై ఛార్జ్ షీట్ దాఖలు కావడంతో మరోసారి జైలుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











