జానీ మాస్టర్ పెద్ది రెమ్యునరేషన్ 18 లక్షలు.. డ్యాన్సర్ల ఇన్సూరెన్స్‌ కోసం విరాళం

తెలుగు సినిమా పరిశ్రమలో డ్యాన్సర్ల అసోసియేషన్‌లో తలెత్తిన అభిప్రాయ భేదాలు ప్రముఖ కోరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ల మధ్య వివాదానికి కారణమైందనే ఊహాగానాలు మీడియాలో భారీ ప్రచారానికి కేంద్ర బిందువుగా మారాయి. అయితే డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదం తలెత్తిన విషయం తెలుసుకొన్న మెగాస్టార్ చిరంజీవి అందుకు కారణంగా భావించిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్‌ను పిలిచి నాలుగు మంచి మాటలు చెప్పి వారి మధ్య సయోధ్య కుదిర్చాడు. ఈ విషయం గురించి హైదరాబాద్‌లో డ్యాన్సర్ల అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివాదం గురించి మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశంలో జానీ మాస్టర్ మాట్లాడుతూ..

డ్యాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గంలో కొందరు సభ్యులు రాజీనామా చేశారు. కొందరు అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో అధ్యక్షురాలు సుమలత, సెక్రెటరీ, ఇతర సభ్యులు ప్రశ్నించారు. దాంతో వారు రాజీనామా చేశారు. అయితే వారి స్థానంలో కొత్త సభ్యులను ఎన్నుకోవాలా? వద్దా? అనే అంశంపై సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అని జనరల్ బాడీ సమావేశంలో చర్చించుకొన్నాం. ఆ క్రమంలో ఓ సభ్యుడు అనుమతి లేకుండా వీడియో తీయడాన్ని అభ్యంతరం చెప్పాను. దాంతో శేఖర్ మాస్టర్, నాకు గొడవ జరిగింది అంటూ ప్రచారం చేశారు. ఆ వార్తల్లో వాస్తవం లేదు. నేను, శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ అంతా మంచి మిత్రులం. ఎవరికీ ఎవరు శత్రువులు కాదు అని చెప్పారు.

Jani Master

మీడియాలో వచ్చిన వీడియోలు చూసి చిరంజీవి మమ్మల్ని పిలిచారు. ఆయనతో కలిసి ఆనందంగా మాట్లాడుకొన్నాం. షూటింగు గ్యాప్‌లో మాతో మాట్లాడారు. ఆయనతో కలిసి భోజనం చేశాం. ఈ సందర్భంగా మా మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పాం. మాకు చిరంజీవి, ఇతర హీరోలు సపోర్టుగా ఉంటామని చెప్పారు. అందరూ ఎంకరేజ్ చేస్తారు. మా మధ్య సయోధ్య కుదిర్చి మంచి విషయాలు ప్రస్తావించిన చిరంజీవి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం అని జానీ మాస్టర్ అన్నారు.

మా డ్యాన్సర్లందరికీ చిరంజీవి గారు స్పూర్తి. ఆయన డ్యాన్సుల చూసే కొరియోగ్రాఫర్లం అయ్యాం. మాకు డ్యాన్స్ అంటే చిరంజీవి వేసే స్టెప్పులే. మా డ్యాన్సర్ల మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఏవైనా విభేదాలు ఉంటే.. మేము పరిష్కరించుకొంటాం. ప్రతీ కుటుంబంలో కొందరు గట్టిగా మాట్లాడుతారు. కొందరు మెల్లగా మాట్లాడుతారు.ఎవరికీ ఇబ్బంది వచ్చినా అందరం కలిసే ఉంటాం అని జానీ మాస్టర్ తెలిపారు.

డ్యాన్సర్ల హెల్త్ ఇన్సూరెన్స్ గురించి జానీ మాస్టర్ ఏం చేయలేరని కొందరు కామెంట్స్ చేశారు. ఇటీవల పెద్ది సినిమాకు పనిచేయడం వల్ల బిజీగా ఉన్నాను. మిగితా సినిమాల్లో పాటలు కూడా చేయలేదు. డ్యాన్సర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలని హీరో రాంచరణ్ 40 లక్షల రూపాయలు ఇచ్చారు. అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలంటే.. 58 లక్షల రూపాయలు అవుతుంది. మిగితా మొత్తం గురించి చాలా మంది మాస్టర్లను అడిగాం. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. అయితే పెద్ది సినిమాకు పనిచేసినందుకు నాకు ఇటీవల రెమ్యునరేషన్ వచ్చింది. నాకు వచ్చిన 18 లక్షల రూపాయలను డ్యాన్సర్ల హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఇస్తున్నాను అని జానీ మాస్టర్ ప్రకటించారు. దాంతో డ్యాన్సర్లు హర్షం వ్యక్తం చేశారు.

Jani Master

టీఎఫ్‌టీడీడీఏ (TFTDDA) లాంటి పెద్ద సంస్థను నడిపించడం అంటే చిన్న విషయం కాదు. ఏ చిన్న తప్పు జరిగినా అధ్యక్షురాలిగా నా మీదకే వస్తుంది. గత బాడీలో చాలా వరకు నిధులు దుర్వినియోగం అయ్యాయి. వాటిని ప్రశ్నించినందుకు మాకు సమస్యలు సృష్టిస్తూనే ఉన్నారు. జోసెఫ్ మాస్టర్ ఓడినప్పటి నుంచి మా మీద వ్యతిరేకత మొదలైంది. ఏ పని చేసినా ప్రతీ దాంట్లో తప్పులు వెతకాలని చూస్తున్నారు. మేం ఏకపక్షంగా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఫెడరేషన్‌కి వ్యతిరేకంగా ఎన్నికలు జరపడం లేదు. అన్నీ కూడా లీగల్‌గానే చేస్తున్నాం అని అధ్యక్షురాలు సుమలత వెల్లడించారు.

Read more about: jani master shekhar master peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X