జానీ మాస్టర్‌ను వెంటాడుతున్న కష్టాలు.. బెయిల్ రిలీజైనా వాళ్ల నుంచి అలాంటి వేధింపులు!
ఇటీవల తెలుగు సినిమా సంబంధించి జరిగిన పలు షాకింగ్ కాంట్రవర్సీలు అయితే చాలానే ఉన్నాయి అని చెప్పాలి. కాగా వీటిలో కుటుంబ గొడవలు మాత్రమే కాకుండా పలు పర్శనల్ విషయాలకి సంబంధించి కూడా ఉన్నాయి. కాగా ఈ లిస్ట్ లో అయితే మొదటిగా యువ హీరో జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ నుంచే మొదలవుతుంది అని చెప్పాలి.
తన మరి ప్రేయసి స్టార్ట్ చేసిన ఈ రచ్చ నుంచి ఒకొక్కటిగా టాలీవుడ్ సినిమాకి చెందిన ప్రముఖులపై వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కాగా అక్కడ నుంచి మెగా హీరోలు నడుమ గొడవలు, అక్కినేని కుటుంబం సమంత విషయంలో పలు కాంట్రవర్సీలు సహా చివరిగా నేషనల్ అవార్డు విన్నింగ్ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ వరకు వచ్చి ఆగింది. కాగా జానీ మాస్టర్ కేసు అయితే ఒకింత వింత అని చెప్పాలి.

తనపై కేసు వేసిన యువతి ఎవరైతే ఉన్నారు ఇన్నాళ్లు రిలేషన్ లో ఉన్నప్పటికీ ఇప్పుడే ఎందుకు బయటకి వచ్చినట్టు అని చాలా కామెంట్స్ వినిపించాయి. అంతే కాకుండా మహిళా డాన్స్ మాస్టర్ ఆనీ కూడా ఇదే ప్రశ్న వేశారు. దీనితో జానీ మాస్టర్ వైపు పూర్తి తప్పు లేదని కొంచెం క్లారిటీ వచ్చింది.
అయినప్పటికీ మన దగ్గర చట్టాలు కోసం తెలిసిందే కదా ఆడవారు విషయంలో వెంటనే స్పందిస్తారు అని కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇలా జానీ మాస్టర్ విషయంలో మాత్రం నెటిజన్స్ నడుమ కూడా వివాదం నడిచింది. అయితే ఆ మధ్య లోనే జానీ మాస్టర్ కి బైలు వస్తుంది అని తనకి వచ్చిన నేషనల్ అవార్డు కోసం తాను వస్తున్నారు అని వార్తలు వచ్చిన వెంటనే బైలు లేదు అవార్డు రద్దు అనే వార్తలు కూడా వచ్చాయి.
కాగా ఈ తర్వాత ఎట్టకేలకి జానీ మాస్టర్ కి బైలు రావడం తాను సోషల్ మీడియాలో మళ్ళీ తన వర్క్ కోసం పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీనిపై కూడా చాలా మంది నెగిటివ్ చేస్తూ ట్రోల్స్ చేయడం విశేషం. ముఖ్యంగా కొందరు జానీ మాస్టర్ విడుదల కావడంతో వెల్కం బ్యాక్ అంటూ కామెంట్స్ చేశారు. వీటికి ఇంకొందరు ట్రోల్స్ చేస్తున్నారు.
జానీ మాస్టర్ ఏమి స్వాతంత్ర పోరాటం చేసి జైలుకి వెళ్ళలేదు రేప్ కేసులో వెళ్ళాడు అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే జానీ మాస్టర్ కేసులో కావాలని అతన్ని ఇరికించినట్టుగా చాలా మంది నమ్ముతున్నారు. ఆమెపై జానీ మాస్టర్ నిజంగానే అత్యాచార యత్నం ఎప్పుడు నుంచో చేస్తున్నట్టు అయితే జస్ట్ కొన్ని నెలల కితమే జానీ మాస్టర్ ని పొగుడుతూ ఎందుకు పోస్టులు చేస్తుంది అని..
ఈ విషయంలో మాత్రం ఏదో తేడా జరిగింది అని ఆనీ మాస్టర్ సహా చాలా మంది నమ్ముతున్నారు. కానీ ఇలాంటివి ఏవి పట్టించుకోకుండా తమకి కావాల్సిన కామెంట్స్ చేస్తూ కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. మరి ఇంతలా అవమానపరచడం అవసరమా అనేది వాళ్ళే గుర్తించాలి. ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ పోస్ట్ లో రచ్చ నడుస్తుంది.


Click it and Unblock the Notifications











